అనుక్షణం ఘర్షణ పడే చంద్రబాబులో ఏదో మానసిక సంఘర్షణ ఉన్నట్లే!

అసలు చంద్రబాబు గారికేమైంది? నలభైయేళ్ల రాజకీయ అనుభవం బూడిదలో పోసిన పన్నీరౌతుంది. పధ్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకి "ఆపద్ధర్మ ముఖ్యమంత్రి" గా పాలన మీద ఉండే పరిమితులు ఏంటనేది తెలియకుండా ఉంటుందా? రాజకీయంపై పట్టున్న తెలుగు ప్రజలు ప్రధానంగా అడుగుతున్నసూటి ప్రశ్న. విధాన పరమైన ఎటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కు, గాని పాలనలో సీరియస్నెస్ లేని శాంతి భద్రతల పరిరక్షణ అంటే "కేర్ టేకర్ సీఎం"గా మాత్రమే ఆయన ప్రవర్తించాలి.  అయినా సరే, ఏపీ పాలన మీద మునుపటి లాగే పట్టు బిగిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు అంటే  సచివాలయం వదలడంలేదు. అధికారాన్ని ఆయన బంకలాగే పట్టుకున్నారు.


ఏప్రిల్ 11 న పోలింగ్ ముగిసినప్పటి నుంచీ “ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషీన్స్” పనితీరుపై వివిద కార్యక్రమాల పెర్లతో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలు తిరుగుతూ నరేంద్ర మోడీ నాయకత్వం లోని బిజేపి ఓటమికి తనకు శాయశక్తులా ప్రచారం చేసి బుధవారం అమరావతి తిరిగి వచ్చారు చంద్రబాబు. వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ మంత్రి, అధికారులతో సీరియస్‌గా చర్చలు జరిపారు. జులై నెలలో గ్రావిటీపై నీళ్లివ్వాలని ఆదేశించారు. మరుసటి రోజు గురువారం రాజధాని నిర్మాణపనుల్ని పర్యవేక్షించారు మంత్రి నారాయణ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో సీఆర్డీఏ అధికారులు కూడా పాల్గొన్నారు.


అయితే అంతా వృధా ప్రయాస. అపద్ధర్మ ముఖ్యమంత్రి అదేశాలు పాటించటం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నవేళలో అమలుచెయ్యటం ఎంత ప్రమాధకరమో ఆయనకు తెలియంది కాదు. ఈ నలభై రోజులూ ఏ రాజకీయాలు ఉండవు. ఇంటికి వెళ్ళి చేసే పనిలేని రాజకీయ నాయకులే సచివాలయంలో ఉంటారు. దేవాన్ష్ తో ఆడుకోవటం కూడా మరచి పోయి రాజకీయాల వెంటపడటం ఏం న్యాయం? 


ఈ మొత్తం వ్యవహారాన్ని ఒకకంట గమనిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్, చంద్రబాబు కదలిక లపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తరచూ వీడియో కాన్ఫరెన్స్‌ లు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పడంతో, సీఈసీ ఈ అంశాన్ని కొంచెం కఠినంగానే పరిశీలనలోకి తీసుకుని చంద్రబాబుకు నోటీసులు పంపినట్లు సమాచారం. కానీ, చంద్రబాబు మాత్రం, "చేతులు ముడుచుకుని కూర్చోలేం కదా! ప్రజలే నాకు ముఖ్యం! ఆ తర్వాతే మిగతా ఏ విషయమైనా!" అంటూ సన్నాయి రాగాలు తీస్తూ మొండికేస్తున్నారు.


ఇప్పటికే పోలింగ్ సరళిపైనా, ఈవీఎంల పనితీరుపైనా ఎన్నికల సంఘంతో ఘర్షణ పెట్టుకున్న బాబు, తెగేదాకా దారం లాగాలన్న పట్టుదలతో  వున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంతవరకు ముఖ్యమంత్రి కేర్ టేకర్ ముఖ్యమంత్రి మాత్రమే. ఆయన ఎలాంటి నూతన లేదా విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడని ముఖ్యమంత్రికి ఙ్జానం లేదంటారా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: