జయప్రదపై అజంఖాన్ అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు: జయప్రద, సుష్మ తీవ్ర ప్రతిఘటన

ప్రఖ్యాత సినీనటి, బీజేపీ రాంపూర్ పార్లమెంట్ అభ్యర్థి జయప్రదను, ద్రౌపదితో పోల్చారు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సమాజ్ వాది పార్టీ నేత అజంఖాన్, జయప్రదపై వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై సుష్మా స్వరాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ ని ఉద్దేశించి,  "ములాయం బయ్యా! మీరు సమాజ్ వాదీ పార్టీకి తండ్రి లాంటి వారు కదా! రాంపూర్ లో మీ పార్టీ ప్రముఖ నేత ద్రౌపదీ వస్త్రాపహరణం చేశాడు. మీరు మాత్రం "బీష్ముడు" లాగా మౌనంగా కూర్చొని తప్పు చేయకండి" అంటూ ట్వీట్ చేశారు.

ఇటీవల ఎన్నికల ప్రచారంలో అజంఖాన్, జయప్రదను ఉద్దేశించి, "రాంపూర్ ప్రజలారా! ఓ షాహ్బాద్ ప్రజలారా! ఓ భారత ప్రజలారా! ఆ వ్యక్తిని గుర్తించడానికి మీకు 17 ఏళ్లు పట్టింది, ఆ వ్యక్తి ఖాకీ అండర్ వియర్ వేసుకుందని నేను 17 రోజుల్లోనే గుర్తించాను" అని అఖిలేష్ యాదవ్ సమక్షంలోనే అజంఖాన్ ఇలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం.

తనపై అజాంఖాన్ దాడి హెచ్చరిక చేశారని, యాసిడ్ పోస్తానంటూ బెదిరించారని జయప్రద కన్నీరు మున్నీరైంది.
దీనిపై అజాంఖాన్ తీవ్రంగా స్పందించారు. దారుణంగా మాట్లాడారు, జయప్రదను రాంపూర్ లో గతంలో ఎంపీని చేసింది తానేనని. అయితే ఆమె ఖాకీ అండర్ వేర్ ధరించిందని గుర్తించ లేదని దారుణ సెక్సీ ఆరోపణలు చేశారు.

 "ఆమె గొప్ప నాట్యగత్తె, ఆమెను పదిహేడు సంవత్సరాలపాటు ఎవరూ టచ్ చేయకుండా నేనే కాపాడా!" అంటూ అజాంఖాన్ వ్యాఖ్యానించ డంపై మరింత వివాదాస్పదమైంది.  

ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి.  

ఒక మహిళా రాజకీయ నేత పట్ల ఇంత సెక్సీ ఆరోపణలు చేయడంపై అందరూ అజాంఖాన్ పై దుమ్మెత్తి పోశారు. 



దీంతో, అజమ్ ఖాన్ చేసిన కామెంట్స్ పై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఒక మహిళానేతపై చేయాల్సిన వ్యాఖ్యలేనా? ఇవి అంటూ అందరూ మండిపడుతున్నారు. 
జయప్రద, అజాంఖాన్, నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ తరుఫున ప్రముఖ నాయకులుగా చెలామణీ అయిన నేతలు. ఒకరికొకరు సహకరించుకొని గెలిచారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు దాపురించాయి.


జయప్రదపై అజాంఖాన్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఆమెపై వ్యక్తిగత లైంగిక విమర్శలు కూడా చేసి వార్తల్లో నిలిచారు. ఇద్దరి మద్య ఇప్పటికీ కూడా పచ్చిగడ్ది వేస్తే భగ్గు మంటుంది. కాలాంతర పరిణామాల్లో సమాజ్ వాదీ నుంచి బహిష్కరణకు గురైన జయప్రద రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఈ 2019 ఎన్నికల ముంగిట్లో పొలిటికల్ లాబీయింగ్ చేసి బీజేపీలో చేరారు. ఎలాగోలా యూపీలోని ఆమె ఇదివరకు గెలిచిన రాంపూర్ పార్లమెంట్ సంపాదించారు.

ఇప్పుడు రాంపూర్ బీజేపీ  అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. అయితే ఈమెకు ప్రత్యర్థి మరెవరో కాదు ఒకప్పటి ఆమె మిత్రుడు ఇప్పటి ఆగర్భశత్రువు అజాంఖానే! సమాజ్ వాదీ నుంచి రాంపూర్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. తనపై అభ్యంతరకర మైన వ్యాఖ్యలు చేసిన సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ పై రాంపూర్ బిజెపి అభ్యర్థి జయప్రద తీవ్రంగా మండిపడ్డారు. రాంపూర్ ప్రచారంలో నిన్న  (ఆదివారం) ఆజంఖాన్ జయప్రదపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనపై ఆజంఖాన్ వాడిన పదజాలాన్ని తాను సహించబోనని జయప్రద అన్నారు. ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో ఆమె ఆజంఖాన్ వ్యాఖ్యలపై మాట్లాడారు. ఆజంఖాన్ కు ఎవరూ ఓటు వేయవద్దని ఆమే ప్రజలను కోరారు. 

మీరు నన్ను మీ సోదరిగా భావిస్తే ఆజంఖాన్ కు వ్యతిరేకంగా పోరాడండని ఆమె పిలుపునిచ్చారు. సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ పై కూడా ఆమె మండిపడ్డారు.  జయప్రద పై చేసిన వ్యాఖ్యలకు గాను ఆజంఖాన్ కు షోకాజ్ నోటీసు పంపిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ ఆదివారం నాడు మీడియాకు తెలియజేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: