మీడియాకి 'పచ్చ పిచ్చి' ముదిరింది దాన్ని కుదుర్చుతా! పివిపి

విజయానికి తండ్రులు అనేకం. పాపం! అపజయం అనాధ. దీన్ని చంద్రబాబు నిజం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనకు బాగా తెలుసు తాను, తన రాజకీయగణం అత్యంత దయనీయంగా ఓటమి చవి చూడబోతోందని. అందుకే ఆ ఓటమికి ఇప్పుడు తండ్రిని వెదికే పనిలో పడ్డారు చంద్రబాబు.

 

పాపం అమాయకంగా దొరికింది ఎన్నికల సంఘం. తను ప్రకటన చేసిందే తడవుగా పచ్చ గొట్టాలు బాకాలు ఊదటం మొదలెట్టాయి. ఈ పచ్చ మీడియా రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదని, తమ వ్యతిరేఖులపై ఎలా దుష్ప్రచారం చేస్తారో పివిపి కూడా నొక్కి వక్కాణిస్తున్నారు. 


ఎన్నికల పలితాల నాటికి మన అపర గోబెల్ అబద్ధాలలో నోబుల్-ప్రైజ్ కొట్టేసే పనిలోపడ్దారు. ఇంకా నలభై రోజులు కేంద్రానికి వ్యతిరేఖంగా ప్రతిపక్ష పార్టీలను సమర రంగాన ధీటుగా నిలిపే పనిలో పడ్దారు. ఆయన ప్రయత్నాలు ఎంతవరకు నెరవేరతాయోగాని, రాష్ట్రాధికారం మాత్రం టిడిపి చేయి జారిపోయినట్లే నని బాబుకు అర్ధమవ బట్టే ఈ దేశ పర్యటన. దాన్ని కప్పెట్టే పనిలో పచ్చమీడియా మునిగిపోయింది. అయితే పచ్చ మీడియాకి పిచ్చెక్కించే పనిలో పడ్డారు ప్రముఖ సినీ నిర్మాత పివిపి. 

 

తనపై ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారంపై చట్టపరంగానే ఎదుర్కొంటానని విజయవాడ వైసిపి పార్లమెంట్ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారం తనపై చాలా మంది వ్యక్తులు, సంస్థలు అవాకులు, చెవాకులు పేలారని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం జన్మహక్కుగా భావించేవారికి ఎవరో ఒకరు గుణ పాఠం చెప్పాలని పీవీపీ అన్నారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా తప్పే. ఆయన నేడు శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, "నాపై తప్పుడు కేసులు బనాయిస్తే కోర్టులు క్లీన్‌ చిట్‌ ఇచ్చాయి" 

 నాపై దుష్ప్రచారం చేసినవారికి "లా-పవర్‌ ఏంటో చూపిస్తా!" టీవీ5, మహా న్యూస్‌, ఒక పార్లమెంట్ సభ్యునిపై తాను పరువునష్టం దావావేస్తానని చెప్పారు. ఒక్కొక్కరిపై ₹100కోట్ల పరువు నష్టం కోసం దావా వేస్తానని అన్నారు. ఇలాంటి వారికి ఎక్కడో ఒక చోట చెక్‌ పెట్టాలి. ఇప్పుడు నా చేతల్లో చూపిస్తా. ఇలాంటి వారికి గుణపాఠం నేర్పాలి. నేను చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటానని అన్నారు. ఎన్నేళ్లు అయినా పోరాటం చేస్తాను. వారిని నడిరోడ్డు పైకికి ఈడుస్తాను వదిలేస్తే మరొకరు ఇలా చేయటం మొదలెడతారు. కోల్‌గేట్‌ పవర్‌ స్కామ్‌ లో చంద్రబాబు నాపై ఆరోపణలు చేశారు. ఆ స్కామ్‌ లో ఉన్నది వై. హరిశ్చంద్ర ప్రసాద్‌. ఆయనకు భూములు కేటాయించింది చంద్రబాబే. సీబీఐ ఛార్జ్‌షీట్‌ లో నా పేరు ఎక్కడా లేదు. 

 

నేను నిర్మాతగా 150 సినిమాలు తీశాను. సౌండ్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ లో మా కంపెనీకి బెస్ట్‌ అవార్డు వచ్చింది. మా కంపెనీలో పెద్ద పెద్ద హీరో, హీరోయిన్లు పని చేశారు. అగ్రిమెంట్‌ ప్రకారమే మేము నడుచుకుంటాం. దాన్ని ఎవరు అతిక్రమించినా వెంటనే చర్యలు కూడా ఉంటాయి. అది తెలియకుండా మాట్లాడటం సరికాదు. ఎన్ని కలు ముగిసే వరకూ నాపై చేస్తున్న దుష్ప్రచారంపై మాట్లాడకూడదని అనుకున్నాను.

 

"రానున్న సోమవారం నుంచి (అంటే నేటి నుంచి) నా చర్యలు ఉంటాయి. పీవీపీ ఎప్పుడూ తప్పు చేయలేదు. నాపై చేసిన ఆరోపణలపై కోర్టులో తేల్చుకుంటా. ఇక  తెలుగు నిఘంటువులో "యూటర్న్‌" అనే పదాన్ని చంద్రబాబు తన చేష్టలతో చేర్చారు. దానికి ఆయనే సరిగ్గా సరిపోతారు. 2014లో చంద్రబాబును గెలిపించింది ఇవే ఈవీఎంలు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోయారు"  అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: