ఏపిలో జగన్ జెండా ఎగురుతుంది..వీడీపీ అసోసియేట్స్ సర్వే!

siri Madhukar
ఏపిలో ఎన్నికల ప్రచారాలకు ఇంకొద్ది సమయమే ఉంది.  ఇప్పటికే ముఖ్య పార్టీల గెలుపు, ఓటములపై రక రకాల సర్వేలు వచ్చాయి.  అయితే ప్రజల నాడి, తీర్పు ఈ నెల 11న ఉండబోతుంది..దీనికి ఎదురేలేదు.  అయితే సర్వేలు కొన్ని వాస్తవానికి అద్దం పట్టేలా ఉంటే..మరికొన్ని ఫేక్ సర్వేలు ఉన్నాయంటున్నారు ముఖ్య పార్టీ నేతలు.  ఏది ఏమైనా కొంత కాలంగా ఏపిలో వైసీపీ ఫ్యాన్ గాలి వీస్తుందని చాలా మంది అంటున్నారు..అనడమే కాదు సర్వేలు కూడా అదే చెబుతున్నాయి.  


తాజాగా సెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 106 నుంచి 118 సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని ప్రభుత్వాన్ని స్థాపించనుందని వీడీపీ అసోసియేట్స్ తన సర్వే ఫలితాలను ప్రకటించింది.  కాగా తెలుగుదేశం పార్టీ 40 శాతం ఓట్ షేర్ కు పరిమితమై 54 నుంచి 68 సీట్లను పొందవచ్చని అంచనా వేసింది. వైసీపీ  వైసీపీకి 43.85 శాతం ఓట్ షేర్ వస్తుందని అంటున్నారు.  


పవన్ కళ్యాన్  జనసేనకు 9.80 శాతం ఓట్లు రావచ్చని 1 నుంచి 3 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించవచ్చని అంచనా వేసింది. మిగతా పార్టీలకు 0.40 నుంచి 2.40 శాతం వరకూ ఓట్లు వస్తాయని, వారికి దక్కే సీట్లు లేవని తెలిపింది.  వీడీపీ అసోసియేషన్  కులాల వారీగా కూడా విశ్లేషించింది.  కాపు, బలిజ, కమ్మ, బ్రాహ్మణ వర్గాలు టీడీపీ వైపు ఉండగా, రెడ్డి, వైశ్య, క్షత్రియ/రాజు, వెలమ, ముస్లిం, మాల, మాదిగ, ఆదివాసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున్నారని పేర్కొంది.
Andhra Pradesh Assembly Election-2019 Projection #AssemblyElections2019 pic.twitter.com/3ZVjNolV9u

— VDPAssociates (@VDPAssociates) April 8, 2019 Jagan Reddy's YSR Cong projected to sweep Andhra election winning 106-118 seats.116 is figure required for 2/3rd majority #AssemblyElections2019 pic.twitter.com/Ue3TwVtY1W

— VDPAssociates (@VDPAssociates) April 8, 2019 #AssemblyElections2019 pic.twitter.com/6SLwJBpey6

— VDPAssociates (@VDPAssociates) April 8, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: