రాహుల్ గాంధీ తన తండ్రి లాగా.....ఒక డాన్సర్‌ ను పెళ్లి చేసుకోవాలి!

ఎండలు మండిపోతున్నాయి ఆపై ఎన్నికల సెగలు రాజకీయ నాయకులు ఎన్నికలలో గెలుపుకోసం ఆహరాహరం ప్రచారంలో పాల్గొంటున్నారు. కొందరికి వడదెబ్బకు మైండ్ బ్లాంకైపోతుంది. ఆసమయంలో వాళ్ళనోటికి మెదడుకు కనక్షన్ వీకై నోరు దానిష్టం వచ్చినట్లు మాట్లాడినా మెదడు గుర్తించలేక పోతోంది. అలా మైండ్ దొబ్బిన రాజకీయ నాయకులకు సురేంద్ర నారాయణ సింగ్ ఒకరు. ఈయన ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఈయన జన్మహక్కుగా భావిస్తుంటారు.

సోనియా గాంధీ ఇటలీ లో డాన్సర్ అంటూ, సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఆమెను రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకొని తన ఇంటి మనిషి చేసుకున్నారు అని కూడా అన్నారు. తన తండ్రి లాగే రాహుల్ గాంధీ కూడా ఒక డాన్సర్‌ ను పెళ్లి చేసుకోవాలి! అని అనటం - సోనియా గాంధి కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తీవ్రంగా సంచలమైంది. 

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి తన నోటిదురద ప్రదర్శించారు. ఈసారి సోనియా గాంధీ కుటుంబంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ ఇటలీ లో ఒకప్పుడు డాన్సర్ అంటూ, ఆమెను రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకొని తన ఇంటిమనిషి చేసుకున్నారన్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన డాన్సర్ సప్నా చౌదరిని రాహుల్ పెళ్లి చేసుకోవాలని సూచించారు. 


అప్పుడు అత్తా కోడళ్లు, ఒకే సంస్కృతి, ఒకే వృత్తికి చెందినవారవుతారు అంటూ ఎద్దేవా చేశారు.హర్యానాకు చెందిన ప్రముఖ డ్యాన్సర్, గాయని, స్టేజ్ ఆర్టిష్ట్ సప్నా చౌదరి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరింది. దీనిపై యూపీకి చెందిన ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ స్పందిస్తూ, ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజలు ఒక నర్తకికి దేశాన్ని నడిపే అవకాశం ఎప్పటికీ ఇవ్వరన్నారు. అందుకే సమర్థుడైన, నిజాయితీపరుడైన నరేంద్ర మోదీకి ప్రజలు అధికారం అప్పగించారన్నారు.

సార్వత్రిక ఎన్నికల వేళ నేతల మాటలు ఇలా తూటాల్లా పేలుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇదే బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రోజూ ఫేషియల్ లేనిదే మాయావతి బయటకు రారని, తలకు నల్లరంగు వేసుకుంటారని విమర్శించారు. లక్నోలో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర నారాయణ్ సింగ్,  బీఎస్పీ అధినేత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

అంతకు ముందు హిందువులంతా ఐదుగురేసి పిల్లల్ని కనాలంటూ కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాజాగా సోనియా గాంధి డాన్సర్ అంటూ సురేంద్ర సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైనది. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులు సురేంద్ర సింగ్ వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నారు. ఆయన నోటికి అడ్డూ అదుపు లేదంటూ మండిపడు తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: