"దేవర" లో నా పాత్ర అలా ఉంటుంది... జనాలకు షాక్ ఇచ్చిన జాన్వి..!

MADDIBOINA AJAY KUMAR
శ్రీ దేవి , బోనీ కపూర్ ల కూతురు అయినటువంటి జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇంత కాలం పాటు హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు తీసుకెళ్లిన ఈ నటి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమపై ఫుల్ ఇంట్రెస్ట్ ను చూపిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈమె భారీ అంచనాలు కలిగిన దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ నుండి జాన్వి కి సంబంధించిన కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో జాన్వీ చాలా సీరియస్ పాత్రలో కనిపించబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా ఈ బ్యూటీ తాను దేవర సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాను అనే విషయాన్ని క్లారిటీగా చెప్పింది. జాన్వీ తాజాగా మాట్లాడుతూ ... ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర మూవీ లో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో తన పాత్ర చాలా వినోదాత్మకంగా ఉంటుంది అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. దేవర మూవీలో చాలా సీరియస్ పాత్రలో నటిస్తోంది అనుకుంటే ఈమె చాలా వినోదాత్మకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: