వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... జగన్మోహన్ రెడ్డి పార్టీ అత్యంత దారుణంగా విఫలమైన సంగతి మనందరికీ తెలిసిందే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ పార్టీ... ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే ప్రమాదానికి వచ్చింది. ఇక దీనికి తగ్గట్టుగానే తెలుగుదేశం కూటమికి 164 స్థానాలు వచ్చాయి. ఏపీలో కొత్త తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... వైసిపి పార్టీని... టార్గెట్ చేస్తూనే ఉంది.
 

ఋషికొండపై నిర్మించిన భవనాలను, ప్రభుత్వ ఫర్నిచర్ విషయంపై... తెలుగుదేశం ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డిని విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తుంది.  అలాగే వైసిపి పార్టీ ఆఫీసులను కూల్చేందుకు కూడా... తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఏదో ఒక సాకు చెప్పి... వైసీపీ పార్టీ ఆఫీసులకు నోటీసులు అందించి... ధ్వంసం చేసేందుకు... టిడిపి ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఇలాంటి నేపథ్యంలో... ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పెందుర్తి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు  సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినందుకు నిద్ర మాత్రలు మింగి... ఆయన ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారట.ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు.. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి కూడా తరలించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో అన్నం రెడ్డి అదీప్ రాజు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

అయితే ఈ వార్తలపై స్వయంగా... అదిప్ రాజ్ స్పందించారు. తాను చిన్నపాటి అనారోగ్యం బారిన పడ్డానని... దానికోసం ఆసుపత్రికి వెళ్లాను కానీ ఆత్మహత్య చేసుకున్నందుకు కాదని ఆయన వెల్లడించారు. అయితే ఐదు గంటల తర్వాత డాక్టర్లు తనను డిశ్చార్జ్ చేశారని... కానీ కొంతమంది తనపై దృశ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. ఈ అసత్య ప్రచారాలను వైసీపీ నేతలు గాని ఏపీ ప్రజలు కానీ నమ్మకూడదని కోరారు. అందరూ రిలాక్స్ గా ఉండాలని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: