టీడీపీని కలవరపెడుతున్న గ్రహబలాలు .. ఓడిపోయిన ఆశ్చర్యం లేదంటా ..!

Prathap Kaluva

రాజకీయాల్లో ముహుర్తాలు, సెంటిమెంట్స్ కొత్తేమి కాదు. ప్రతి రాజకీయ నాయకుడికి ఎక్కడో ఒక చోట ఇటువంటివి పట్టించుకుంటారు. రాహుకాలంలో ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిందట కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో కొందరు నేతలు దోష నివారణ పూజలు చేయించుకొంటూ ఉన్నారట. రాహు కాలంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో..ఆ ప్రభావం తమ మీద పడకుండా.. దోష నివారణ చేయించుకొంటున్నారట నేతలు!ఆ రేంజ్లో ఉంటాయి నేతల నమ్మకాలు.


ఇక ఇదే సమయంలో జాతక రీత్యా తెలుగుదేశం పార్టీకి శనిగండం మొదలు కానున్నదని అంటున్నారు పండితులు. ఈ నెల ముగింపు సమయం నుంచి తెలుగుదేశం పార్టీ శని దశ మొదలు కానున్నదట. అది కొన్ని రోజుల పాటు సాగుతుందట! ఎంత వరకూ అంటే.. ఎన్నికల పోలింగ్ వరకూ అని కొందరు జ్యోతీష్య పండితులు చెబుతూ ఉన్నారు!ఇది అంత మంచి దశ కాదు అని.. అలాంటి దశలో పురోగమనం ఉండదని.. టీడీపీపై ఆ ప్రభావం తప్పదని వారు హెచ్చరిస్తూ ఉన్నారు.


ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి ఇలాంటి దశ రావడం ఆ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తుందని చెబుతున్నారు.తీరా ఎన్నికల సమయంలో ఇలాంటి దశల ప్రారంభం కావడంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓడినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని.. గ్రహబలం అనుకూలంగా లేని కారణంగా టీడీపీకి ఈ ఎన్నికలు కలిసి వచ్చే అవకాశం లేదని పండితులు చెబుతున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: