మధ్యతరగతి ప్రజలకు ఈ బైక్ వరం లాంటిది?

Purushottham Vinay
ఈ రోజుల్లో టూ వీలర్ అనేది నిత్యావసరంగా మారింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రేక్షకులకు చాలా పనులు ఉంటాయి కాబట్టి వారికి టూ వీలర్ చాలా అవసరం. కానీ పెట్రోల్ రేట్లు కారణంగా చాలా మంది టూ వీలర్ కొనడానికి భయపడుతున్నారు. అలాంటి మధ్య తరగతి ప్రజల కోసం బజాజ్ కంపెనీ ఒక సూపర్ బైక్ ని మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఈ బైక్ మిడిల్ క్లాస్ జనాలకి ఒక వరం లాంటిది. ఇక ఆ సూపర్ బైక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


బజాజ్ ఆటో cng ఇంధనంతో నడిచే ప్రపంచంలోనే ఫస్ట్ బైక్‌ను 18 జూన్ 2024న విడుదల చేయబోతోంది.బజాజ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు.బజాజ్ కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన బైక్ పల్సర్ 400 లాచ్ లో మాట్లాడుతూ, 'ప్రపంచంలో మొట్టమొదటి CNG-శక్తితో పనిచేసే మోటార్‌సైకిల్ వచ్చే నెలలో రాబోతోంది. పెట్రోల్‌తో నడిచే బైక్‌తో పోలిస్తే, దాని రన్నింగ్ ఖర్చు అనేది సగం ఉంటుంది.  ఇది ఎంతో అద్భుతమైన ఆవిష్కరణ' అంటూ చెప్పుకొచ్చారు.పెట్రోల్ ధరలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో బజాజ్ ఈ  CNG మోడల్‌తో పెరుగుతున్న రన్నింగ్ ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్న మధ్య తరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటుంది.


ఈ బైక్‌ను చాలా దశల్లో విడుదల చేయనున్నారు. ఈ బైక్ ని మొదట మహారాష్ట్రలో, తరువాత cng స్టేషన్లు అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో స్టార్ట్ చేస్తారు.ఈ cng రన్ బైక్ పేరు Bruiser 125 CNG. ఇందులో 100CC, 125CC, 150-160CC బైక్‌లు ఉంటాయని బజాజ్ కంపెనీ వారు తెలిపారు.ఇక ఈ బైక్ ప్రోటోటైప్‌ను పరీక్షించినప్పుడు, కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలలో 50% తగ్గింపు, కార్బన్ మోనాక్సైడ్ (CO) ఉద్గారాలలో 75% తగ్గింపు, నాన్-మీథేన్ హైడ్రోకార్బన్ ఉద్గారాలలో 90% తగ్గింపు ఉందని రాజీవ్ చెప్పారు. పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే తగ్గింపు ఉంటుంది. అంటే cng బైక్ నుంచి తక్కువ కాలుష్యం అనేది ఉంటుంది. నిజంగా ఈ బైక్ వల్ల మధ్య తరగతి జనాలకు ఖచ్చితంగా చాలా రకాలుగా మేలు కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: