ఒకేరోజు పిఠాపురంలో జగన్, పవన్ ఎంట్రీ.. స్వామి భక్తికే ఓటేస్తారా?
ఇటీవల జనసేన అధినేత, పిఠాపురం శాసనసభ అభ్యర్థి పవన్ కల్యాణ్ ప్లాన్ చేసిన రోడ్‌షో చర్చనీయాంశమైంది. ఈ నెల 10న పిఠాపురంలో ఈ కార్యక్రమం జరగనుంది. అయితే, రోడ్‌షోకు అనుమతి కోసం పార్టీ ప్రతినిధులు స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డిఓ) కార్యాలయానికి వెళ్లగా, మొండి చెయ్యే ఎదురయ్యింది. కంప్యూటర్ సర్వర్లు డౌన్ అయ్యాయని అధికారులు చెప్పడంతో సాయంత్రం 6:30 గంటల వరకు వెయిట్ చేసామని వారు వాపోయారు.పార్టీ నేతలకు ఓటీపీ (వన్‌టైమ్ పాస్‌వర్డ్) ఇచ్చామని, వారి దరఖాస్తును తర్వాత పరిశీలిస్తామని అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అదే రోజు పిఠాపురంలో బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నందున ఉద్దేశ్యపూర్వకంగానే ఈ జాప్యం జరిగిందన్న అనుమానాలు కూటమి నేతల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి కార్యక్రమాలకు మొదట దరఖాస్తు చేసుకున్న వారికే అనుమతి ఇవ్వాలని టీడీపీ నేత వర్మ పట్టుబట్టారు. ఆయన అధికారులతో మాట్లాడి పవన్ కళ్యాణ్ రోడ్ షోకి అనుమతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ముఖ్యమంత్రి బహిరంగ సభకు వైసీపీ నేతలు ఇప్పటికే అనుమతి పొందారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జనసేన, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 10వ తేదీన పవన్ కళ్యాణ్ రోడ్ షో లేదా ముఖ్యమంత్రి బహిరంగ సభకు ఏ కార్యక్రమానికి అనుమతి ఇస్తారోనని పిఠాపురం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రోజు దగ్గర పడుతుండడంతో రాజకీయ ప్రచారం జోరుగా సాగుతోంది, ప్రజల మద్దతు కోసం అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ ప్రచారాల పోటీ తీరుకు పిఠాపురంలోని పరిస్థితులే నిదర్శనం. మరి చంద్రబాబుని దేవుడిలా పూజిస్తున్న పవన్ కళ్యాణ్ కి ఈసారి ఓటేస్తారా లేకపోతే జగన్ కి ఓటేసి గెలిపిస్తారా అనేది చూడాలి.