అందుకే ఇప్పటివరకు నేను హిందీ సినిమాలు చేయలేదు.. ఫహాద్ ఫాసిల్..!

Anilkumar
మలయాళం స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ గురించి మనందరికీ తెలిసిందే. విలక్షణ నటుడిగా ఇప్పటికే ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈయన మలయాళ స్టార్ హీరోగా మలయాళం లోనే కాకుండా తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తెలుగు తమిళ సినిమాల్లో నటిస్తున్న ఫహాద్ ఫాసిల్ ఇంతవరకు బాలీవుడ్ సినిమాల్లో మాత్రం నటించలేదు. అయితే తమిళ స్టార్ హీరోలు చాలామంది ఇప్పటికే హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలు సైతం ఇప్పటికే

 హిందీలో వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఎందుకు బాలీవుడ్ లో సినిమాలు చెయ్యట్లేదు అన్న విషయాన్ని బయట పెట్టాడు. దీంతో ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన హిందీ సినిమాలు చేయకపోవడానికి గల కారణాన్ని తెలియజేశాడు. అయితే ఆయన మొదటి నుండి మలయాళ సినిమాల్లో నేను నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వేరే భాషల్లో కూడా ఇప్పటికే విక్రం పుష్ప సూపర్

 డీలక్స్ వంటి సినిమాల్లో నటించి బ్లాక్బస్టర్ విజయాలని అందుకున్నాడు. ఇక పుష్ప సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకుల ఫేవరెట్ అయిపోయాడు.  ఇక పుష్ప సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకుల ఫేవరెట్ అయిపోయాడు. ఆయన మాట్లాడుతూ అంతకుముందు అతనికి హిందీ ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ ల్లో నటించలేదు ఫహద్ ఫాజిల్. దీని పై ఆయన మాట్లాడుతూ.. ఐదారు సంవత్సరాల క్రితం. నన్ను సంప్రదించిన తొలి హిందీ చిత్రానికి ఓకే చెప్పాను. అయితే స్క్రిప్ట్‌ని ఫైనల్ చేయలేకపోయాను. ఆ తర్వాత దర్శకుడు మరొకరిని ఎంచుకున్నాడు. నేను నుంచి బయటకు వచ్చాను. హిందీలో సీరియస్ గాని, కరెక్ట్ గాని కథేమీ దొరకలేదు’ అని ఫహద్ ఫాసిల్ అన్నారు.  ‘నాకు హిందీ బాగా రాదు. కానీ నేను హిందీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తెలుగు, తమిళ లు చేశాను. హిందీ కూడా చేస్తాను. కానీ, ఎప్పుడొస్తుందో తెలీదు’ అని చెప్పుకొచ్చాడు ఫహద్ ఫాజిల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: