ఓటమి భయంతోనే వైసీపీ నేతలు, మహిళలపై దాడులా.. బాబు ఈ ప్రశ్నలకు జవాబిస్తారా?

Reddy P Rajasekhar
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో హోం మంత్రి తానేటి వనితపై జరిగిన దాడి ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ నేతలు తనపై దాడి చేసినట్టు ఆమె చెబుతున్నారు. బాబు ఓటమి భయంతోనే మహిళా నేతలు, మహిళలపై దాడులు చేయిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే మహిళల ఖాతాలలో జమ కావాల్సిన కొన్ని పథకాల నగదును జమ కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపణలున్నాయి.
 
తానేటి వనితపై జరిగిన దాడి ఘటనతో పాటు విజయవాడలో మహిళలపై బోండా ఉమ అనుచరులు దాడులు చేశారని, బనగానపల్లిలో కూడా టీడీపీ నాయకులు దాడులు చేశారని సమాచారం అందుతోంది. రాష్ట్రంలో మహిళల ఓట్లు వైసీపీకే పడే అవకాశం ఉండటం, వైసీపీకే మహిళలు మద్దతు ఇస్తుండటంతో ఈ విధంగా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో పథకాలు అమలయ్యాయనే సంగతి తెలిసిందే. మహిళలకు గతంలో ఏ పార్టీ బెనిఫిట్స్ ఇవ్వని స్థాయిలో జగన్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. జగన్ మళ్లీ సీఎం కాకూడదని రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమైన సంగతి తెలిసిందే. బాబు ఎన్ని పథకాలను ప్రకటించినా 54 శాతం మహిళలు వైసీపీకి మద్దతు ఇస్తున్నారు.
 
మహిళల వల్ల మరోసారి అధికారం దూరం అవుతుందనే భయంతోనే బాబు ఈ దాడులు చేయిస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. చంద్రబాబు, పవన్ కు మహిళలపై గౌరవం లేదని ఇలాంటి దాడులు చేసిన వాళ్లకు ఓట్ల రూపంలో  బుద్ధి చెబుతామని మహిళా ఓటర్లు చెబుతున్నారు. బోండా ఉమ అనుచరులు దాడి చేయడం విషయంలో సైతం కొంతమంది మహిళలు సీరియస్ అవుతున్నారు. బోండా ఉమ తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. తమపై దాడులు జరిగాయని తమపై దాడి చేసిన టీడీపీ నేతలను శిక్షించాలని బాబు చెప్పగలరా అంటూ మహిళలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: