ఎడిటోరియల్ : మంత్రులిద్దరికీ ఒకేసారి చంద్రబాబు షాక్

Vijaya

ఒకేసారి రెండు పిట్టలనేది తెలుగులో చాలా పాపులర్ సామెత. అయితే ఆ సమెత ఇద్దరు ప్రత్యర్ధులపై ఒకేసారి విజయం సాధించినపుడు చెబితే అతికినట్లు సరిపోతుంది. కానీ చంద్రబాబునాయుడు మాత్రం రివర్సులో తన మంత్రివర్గంలోని ఇద్దరినీ ఒకేసారి దెబ్బకొట్టటమే విచిత్రంగా ఉంది. మంత్రులిద్దరినీ సంతృప్తి పరచటానికి ఇద్దరినీ చెరోరకంగా దెబ్బకొట్టారు చంద్రబాబు. ఆ విషయం బయటపడటంతోనే ఇపుడు ఇద్దరూ కలిసే చంద్రబాబుపై మండిపోతున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, విశాఖపట్నం జిల్లాలోని మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుకు ఒకరంటే మరొకరికి పడదు. ఇద్దరి మధ్య సబంధాలు దశాబ్దాలుగా ఉప్పు, నిప్పులాగుంటుంది. దాన్ని అవకాశంగా తీసుకోవాలని అనుకున్నారు చంద్రబాబు. అందుకే రాబోయే ఎన్నికలను పావుగా వాడుకున్నారు. ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు భీమిలీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చింతకాయలేమో నర్సీపట్నం ఎంఎల్ఏ. ఒకరిని దెబ్బ కొట్టేందుకు మరొకరు ఇద్దరూ ఎప్పుడూ ప్లాన్ చేసుకుంటునే ఉంటారు.

 

పార్టీలో చింతకాయలకు మంచి పట్టుంది. పార్టీ పెట్టినప్పటి నుండి చింతకాయల గెలిచినా ఓడినా టిడిపిలోనే ఉన్నారు. నిజంగా ఆయన క్యాడర్ బేస్డ్ లీడరనే చెప్పాలి. అదే సమయంలో గంటాకు బాగా అర్ధ బలముంది. ఎన్నికకొక నియోజకవర్గం, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అన్నట్లుంటుంది గంటా వైఖరి. దాంతో అవకాశం వచ్చిందని ఇద్దరు ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్లాన్ మొదలుపెట్టారు.

 

ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు ఇద్దరినీ ఒకేసారి దెబ్బకొట్టటమే విచిత్రం. గంటాను దెబ్బకొట్టే ఉద్దేశ్యంలో కొడుకు లోకేష్ ను భీమిలీ నుండి పోటీ చేయిస్తున్నారు. దాంతో గంటాకు మండిపోతోంది. అంటే చింతకాయలను తృప్తి పరిచేందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో అనకాపల్లి ఎంపిగా పోటీ చేసేందుకు ప్రయత్నించిన కొడుకు చింతకాయల విజయ్ కు టికెట్ నిరాకరించటం ద్వారా గంటాను సాటిస్ ఫై చేశారు చంద్రబాబు.

 

నిజానికి లోకేష్ పోటీ చేయాలంటే తన నియోజకవర్గం కుప్పమే ఉంది. అదే సమయంలో వైసిపి ఎంఎల్ఏలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవర్గాలూ చాలానే ఉన్నాయి. అవేవీ కావన్నట్లుగా తన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలీ నియోజకవర్గాన్నే చంద్రబాబు ఎంపిక చేయటం ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి చంద్రబాబు చేతిలో దెబ్బతిన్న ఇద్దరు మంత్రులు రాబోయే ఎన్నికల్లో ఎలా రియాక్టవుతారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: