రసవత్తరంగా మారిన కర్ణాటక రాజకీయం..!

KSK
గత ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు దేశం మొత్తం ఉత్కంఠ పరిచాయి. ముఖ్యంగా సమయంలో జరిగిన ఎన్నికలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి చావో రేవో అన్నట్టుగా ఉన్న సమయంలో చేతిదాకా వచ్చిన విజయం చేజారిపోవడంతో జాతీయ స్థాయిలో ఉన్న ప్రముఖ పార్టీల నేతలు బిజెపి పార్టీపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేశాయి.


ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చాక చాలా వరకు దేశంలో ఉన్న సామాన్యుల జీవితాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ బిజెపి పార్టీ పై జాతీయ నేతల మండిపడుతున్న తరుణంలో వచ్చిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు బిజెపి పార్టీకి పుండుపై కారం చల్లినట్లుగా అయ్యింది.


కర్ణాటకలో జిడిఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉండగా కర్నాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేయడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఒకరైన ఉమేష్ యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ రమేష్ కుమార్ కు పత్రాన్ని సమర్పించారు.


చించోలి నియోజకవర్గానికి ఆయన ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఆయన బిజెపిలో చేరవచ్చని భావిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గేకు పోటీగా భాజపా ఉమేశ్‌ను బరిలోకి దించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దీంతో తాజా పరిణామంతో కర్ణాటకలో ఉన్న రాజకీయం మొత్తం రసవత్తరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: