భారత్‌కు అమెరికా మద్దతు..అజిత్ ధోవల్ కి ఫోను చేసిన అమెరికా సెక్రెటరీ!

siri Madhukar

పుల్వామా దాడి తర్వాత భారత్-పాక్ మద్య యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి.  మొన్న తెల్లవారు జామున భారత్ వైమానిక దళం పాక్ ఆక్రమిత ప్రాంతంలోకి చొరబడి ఉగ్రవాద శిభిరాలపై మెరుపు దాడి చేసింది.  కేవలం 21 నిమిషాల్లోనే సర్జికల్ ఆపరేషన్ పూర్తి చేసి 300 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. దాంతో రగిలిపోయిన పాకిస్థాన్ భారత్ పై కాల్పులకు తెగబడుతూ వస్తుంది. నేటి ఉదయం నుంచి జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉన్న వాస్తవ ఆధీన రేఖ వెంట కృష్ణా ఘాటీ సెక్టార్‌లో పాకిస్థాన్ రేంజర్లు  కాల్పులు జరిపాయి. దాదాపు గంటపాటూ ఈ కాల్పుల మోత మోగింది. ఆ తర్వాత పాకిస్థాన్ సైన్యం వెనక్కు తగ్గిందని సైనికాధికారులు తెలిపినట్లు సమాచారం.


మరోవైపు అమెరికా రెండు దేశాలూ తమ సరిహద్దుల వెంట మిలిటరీ చర్యలను కొంతకాలం నిలిపివేసుకోమని సూచించినట్లు తెలుస్తుంది.  ఇలా రెండు దేశాలూ సైలెంటైతే... పరిస్థితి చక్కబడుతుందని అమెరికా భావించినట్లు తెలిసింది. అయితే నిన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రెస్ మీట్ లో శాంతి మాటలు మాట్లాడారు..కూర్చొని మాట్లాడితే సమస్యలు పరిష్కరించుకోవొచ్చని..పుల్వామా దాడి కేసులో పూర్తి సహకారం ఉంటుందని..ఉగ్రవాద అంతానికి తాము కూడా సహకరిస్తామని మాట్లాడారు.  కానీ తెల్లవారు జామునే పాక్ కాల్పులకు తెగబడింది. 


భారత్‌కు అమెరికా మద్దతు : 
భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఫోన్ ద్వారా మాట్లాడారు.  కొంత కాలంగా ప్రపంచ దేశాలకు పెను ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని..ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న ఏ దేశానికైనా అమెరికా వ్యతిరేకం అని అన్నారు.    పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడులను ఆయన సమర్థించారు. భారత్-పాక్ పరిస్థితులపై బుధవారం రాత్రి వీరిద్దరి ఫోన్ ద్వారా సంభాషించారు.

Sources: NSA Ajit Doval and US Secretary of State Mike Pompeo had a telephonic conversation late last night. Pompeo said that the US supported India’s decision to take action against JeM terror camp on Pakistani soil pic.twitter.com/9u5jx8GE9X

— ANI (@ANI) February 28, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: