చంద్రబాబుని ఇబ్బంది పెడుతున్న సొంత పార్టీ నేతలు..!

KSK
గత నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండి బాబు ఆదేశాలను తూచా తప్పకుండా ఆచరించిన చాలామంది టీడీపీ నేతలు ఇప్పుడు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వారిలో ఉన్న ఆవేదన ఆక్రోశం అసహనం ప్రదర్శించడం మొదలు పెట్టారు.


ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలు పార్టీలో ఉండి అనేక అవమానాలు అసంతృప్తులు ఎదుర్కొన్న నేతలు తాజాగా ఎన్నికల ముందు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. సరైన టైం చూసుకుని చంద్రబాబుని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత నాలుగున్నర ఏళ్లలో తన నియోజకవర్గంలో తమ వ్యక్తిగత సమస్యల పట్ల బాబు ముందు సూచనప్రాయంగా కూడా అలక వెలిబుచ్చని నేతలంతా ఇప్పుడు అటకెక్కి కూర్చుకున్నారు.


తమ ఈగో సమస్యల్ని ఆయన ముందు పెట్టి తాడో పేడో తేల్చండి లేకుంటే బిచాణా సర్దుకుంటాం అని బెదిరిస్తున్నారు. ఇప్పటికే మేడా మల్లికార్జునరెడ్డి, రావెల కిశోర్ లాంటి వారు పార్టీని వీడగా చంద్రబాబు మిగిలిన అసంతృప్తుల్ని బుజ్జగించే పనిలో పడ్డారు.


ఒంటరిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో సొంత పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లిపోతే తీవ్ర నష్టం తప్పదని బాబు భావిస్తున్నారట. మరోపక్క చీరాలనియోజకవర్గం ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు రావడంతో చంద్రబాబు వెంటనే టిడిపి మంత్రులను రంగంలోకి దింపి ఆమంచి కృష్ణమోహన్ ని బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: