కేసీఆర్ చంద్రబాబు కు రిటర్న్-గిఫ్టు - శుభముహుర్తం వాలెంటైన్స్-డే - వేదిక జగన్ నూతన గృహం

ఫిబ్రవరి పధ్నాలుగు వాలంటైన్స్ డే! ప్రేమికుల దినోత్సవం. ప్రియురాలు ప్రియుడు ఒకరికొకరు బహుమతులు ఇచ్చు కుంటూ ప్రేమలు పంచుకునే రోజు. సరిగ్గా అదే రోజు యాదృచ్చికంగా వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్ది అమరావతిలో గృహప్రవేశం అవనున్నారు. టిఆరెస్ అధినేత తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ ఆ ఉత్సవానికి హాజరవనుండటం ఒక విశేషం. 

ఏపి ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మాంచి "రిటర్న్-గిఫ్ట్" అదే 'పునః బహుమతి' ఇచ్చి తీర తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా శాసనసభ ఎన్నికల తరవాత ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆమధ్య టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్-కేటీఆర్ కూడా నిర్థారించారు. ఇప్పుడా రిటర్న్-గిఫ్ట్ కు కూడా కేసీఆర్ ఎంచు కున్న ముహూర్తం కూడా వాలంటైన్స్ డే నే, ఫిబ్రవరి 14. అందుకే తెలుగురాష్ట్రాల వారికి కూడా ఆశ్చర్యార్ధకాలతో కూడిన వాలంటైన్స్-డే బహుమానాలు తిరిగి ఇచ్చే రోజుగా మారిపోనుందా? 

వాలంటైన్స్-డే రోజున బాబుకు ప్రేమతో రిటర్న్-గిఫ్ట్ ఇచ్చేటందుకు కేసీఆర్ ఏర్పాట్లన్నీ పూరిచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆరోజున వైఎస్ జగన్ నూతన గృహప్రవేశ మహోత్సవానికి కేసీఆర్ కూడా హాజరవుతారు. ఈ సందర్భంగా అప్పుడే అమరావతి నడిబొడ్డున చంద్రబాబుకు ఇచ్చే రిటర్న్-గిఫ్ట్ పై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.  అయితే రిటర్న్-గిఫ్ట్ ఇస్తామని ప్రకటించిన రోజు నుంచి చంద్రబాబుకు ఒకటే భయం పట్టుకుంది. దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు రకరకాల స్టేట్-మెంట్స్ ఇస్తూ భిన్న విభిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కేసీఆర్ ఒక కేసు పెడితే తాము మూడు కేసులు పెడతామంటూ ఏవేవో సంధి ప్రేలాపనలు చేస్తున్నారు. జగన్-కేసీఆర్ పొత్తును అపవిత్రం గా ప్రచారం చేసేందుకు తమ అను'కుల' మీడియాను అప్రమత్తమో! ఆపసోపాలో! పడుతున్న దాఖలాల సమాచారం వస్తుంది. 


జనాలకు చంద్రబాబు వ్యవహార శైలి అర్థమైంది. జగన్మోహనరెడ్డి అంటే ఏంటో తెలిసొచ్చింది. ఈ ఐదేళ్లలో ఇచ్చిన మాటపై జగన్ నిలబడిన తీరుచూసి ప్రజలు ఆయన నాయకత్వాన్ని అంగీక రించే దిశగా కదులుతున్నారు ముచ్చటగా.  ఒక కార్య సాధన విషయంలో మొండిగా ప్రాణాలను ఫణంగా పెట్టైనా సాధించే  కేసీఆర్ స్టామినాపై గుఱి కుదిరింది ఆంధ్రప్రదేశ్ జనాలకు. అందుకే ఈ మొండోడు ప్రత్యేక హోదాకు అనుకూలంగా అవసరమైతే కేంద్రానికి లేఖ రాస్తాననటంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు విశ్వాసం వెల్లడించారు. ఖచ్చితంగా కేసీఆర్-జగన్ రాజకీయ పొత్తు ఏపికి మేలు జరుగుతుందని అంటు న్నారు. ఇది వారు శుభసంకేతగానే భావిస్తున్నారు. 

ఎన్నాళ్ళీ చంద్రబాబు గారి కంచి గరుడ సేవ. ఎంత జేసినా మిగిలేది శూన్యమేనని ఏపి జనం భావించటంతో వారి ముందు ఈసారి బాబు పప్పులు ఉడకలేదు. ఫిబ్రవరి 14 న అమరావతికి రానున్న కేసీఆర్, అదేరోజు ఒక కీలక ప్రకటనచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అదేకనుక జరిగితే చంద్రబాబుకు కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లే నంటున్నారు. బాబుగారు రిటర్న్ గిఫ్ట్ అందుకోవడానికి ఇక రోజులు లెక్కబెట్టుకోవచ్చుని సమాచారం. 



చంద్రబాబును టిడిపిని గెలిపించుకుంటూ పోతే జనాలకు మిగిలేది బూడిదేనని, ఇలాగే సాగితే చంద్రబాబు, లోకేష్ ఆపై దేవాన్ష్ కు వారసత్వ బానిసత్వం తప్పదని ఏపి జనం గుర్తించారని అంటున్నారు. దేవాన్ష్ పేరుతో ఏపిలో కాలనీలు ఏర్పడుతున్నాయని సమాచారం. ఇవన్ని అంతరించాలంటే రిటర్న్-గిఫ్ట్ వెంటనే ఇచ్చేస్తేసరి అంటున్నారు అమరావతి వాసులు   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: