జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!

Prathap Kaluva

ఇప్పడూ ఆంధ్ర రాజకీయ వేడి మొదలైందని చెప్పాలి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ కేసీఆర్ , కేటీఆర్ ఎప్పుడైతే ఆంధ్ర ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం తధ్యం అయ్యిందో రాజకీయాలు సెరవేగంగా మారుతున్నాయి. అయితే దావోస్ పర్యటనకు వెళ్లాల్సిన చంద్రబాబు దాన్ని రద్దుచేసుకోగా వైఎస్ జగన్ కూడా తమ లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు.    దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు చంద్రబాబు హాజరు కావాల్సింది.


ఇప్పుడు ఆయన స్థానంలో మంత్రులు నారా లోకేష్ - యనమల రామకృష్ణుడుని పంపించాలని నిర్ణయించారు. మంత్రులతో పాటు మరో 15 మంది అధికారుల బృందాన్ని దావోస్ పంపించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.  ఇక మొన్ననే పాదయాత్ర ముగించుకున్న వైఎస్ జగన్ లండన్ లో చదువుతున్న తన కుమార్తెను కలుసుకునేందుకు అక్కడికి వెళ్లాల్సి ఉంది.


కానీ అభ్యర్థుల ఎంపికపై సమీక్షించేందుకు గానూ జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా సమాచారం. ఆయన ఈ రోజు సాయంత్రమే లండన్ వెళ్లాల్సి ఉంది.    పైగా ఇప్పుడు కేసీఆర్ కేంద్రంగా ఏపీ రాజకీయాలు సాగుతుండడం కూడా ఈ ఇద్దరి విదేశీ పర్యటనలు వాయిదా పడడానికి కారణం కావొచ్చని తెలుస్తోంది. ఈ వారంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రావొచ్చని సమాచారం. అప్పుడే ఆంధ్ర రాజకీయాలు మరింత గా వేడెక్కుతాయని వేరే చెప్పల్సిన పని లేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: