చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ నేత..!

KSK
గత నాలుగు సంవత్సరాలు కలిసి మెలిసి ఉన్న టీడీపీ -బీజేపీ పార్టీలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు బట్టి రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మన్నటుగా ఉంది.


ముఖ్యంగా విభజన హామీల లో ఏ ఒక్కటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు పరచ లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా మరోపక్క బిజెపి నేతలు కేంద్రం ఇచ్చిన నిధులు తోనే తమ స్వార్ధ రాజకీయాలు చేసుకుంటున్నారని ప్రజా సంక్షేమం గురించి ఆలోచించకుండా చంద్రబాబు దారుణంగా వ్యవహరిస్తున్నారని బిజెపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.


ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జగన్ కోడి కత్తి కేసు గురించి మాట్లాడుతూ ఎన్‌ఐఏ విచారణ అనగానే చంద్రబాబు నాయుడికి వెన్నులో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడైనా విచారణ చేపట్టే అధికారం ఎన్‌ఐఏకు ఉందని గుర్తు చేశారు.


టిడిపి ఎంఎల్‌ఏలపై దాడి విషయంలో ఎన్‌ఐఏ విచారణను స్వాగతించి, జగన్‌ మీద దాడిపై ఎన్‌ఐఏ విచారణకు చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని, అధికారం పోతుందనే ఆందోళన చంద్రబాబు ఉన్నారని తెలిపారు. చంద్రబాబు రాజకీయాల్లో స్వయం కృషితో ఎదగలేని, కాంగ్రెస్‌తో కలవడంతోనే టిడిపి పతనం మొదలైందని జివిఎల్‌ నరసింహరావు వ్యాఖ్యానించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: