చంద్రబాబు పెరుగుతున్న ఫ్రస్టేషన్‌..టీడీపీ పని అయిపోయినట్టేనా..?

Chakravarthi Kalyan

సీఎం చంద్రబాబు వ్యవహారశైలిలో ఇటీవల చాలా మార్పు కనిపిస్తోంది. అయితే ఆందోళన, లేకుంటే ఆగ్రహం.. ఇదీ ఆయన తీరు. ఆయన ఇటీవల కాకినాడ పర్యటనలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నవారితో వ్యవహారించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కాకినాడ పర్యటనలో కొందరు బీజేపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌ ను అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు మోదీ జిందాబాద్‌, చంద్రబాబు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో సి.ఎమ్. ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆ సమయంలో ఆయన స్థాయి మరచి వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రులు, మంత్రులు వచ్చినప్పుడు విపక్షాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించడం సాధారణమే. పోలీసులే వారిని హ్యాండిల్ చేస్తారు.


కానీ చిత్రంగా కాకినాడ ఇష్యూ విషయంలో చంద్రబాబు విపరీతమైన ఫ్రస్టేషన్‌కు గురైనట్టు కనిపిస్తోంది. నిరసనకారులను కంట్రోల్ చేసేందుకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగారునిరసనకారుల్లో బీజేపీకి చెందిన ఓ మహిళా కార్పొరేటర్ పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు. ఉండమ్మా.. ఏంటమ్మా.. ఏం మట్లాడుతున్నావు. నీకు ఏం కావాలి.. మీ బీజేపీ వాళ్లను జనం కొడతారు. నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని ముంచేశారు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.



అందుకు ఆ మహిళ కూడా ధైర్యంగానే ఆయన ఏమి ముంచేశారు అని ఆమె ప్రశ్నించింది. మీరు కూడా కేంద్రం సొమ్ముతోనే పనులు చేస్తున్నారు కదా.. అంటూ సమాధానం ఇచ్చింది. ఇంకా ఆమె ఏదో మాట్లాడబోతుంటే.. ముఖ్యమంత్రి బస్ మెట్లపై నిలబడి.. నువ్వు ఫినిష్ అయిపోతావు అంటూ హెచ్చరించారు. బయటకు వస్తే మిమ్మల్ని వదలిపెట్టరు. మర్యాదగా ఉండు.. సమస్యలు వస్తాయి అని చంద్రబాబు హెచ్చరించడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: