వర్మ సినిమా తెగింపు - టిడిపికి రాజకీయ ముగింపా?

మొన్నఆదివారం నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో రిలీజ్ తో పాటు ట్రైలర్  విడుదలను వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం కనులపండుగగా చేసుకుంటుంటే రామ్ గోపాల్ వర్మ ఆ ఆనందాన్ని ఆవిరి చేయడం కోసమే అన్నట్టు  కళ్ళల్లో నిప్పులు పోయటానికే వదిలిన వెన్నుపోటు పాట వైరస్ లాగా వైరలై ఇంటా, బయటా, నెట్టింటా ఇందుగలదందు లేదన్నట్టు  ప్రకంపనలు రేపుతోంది.  


పాట సాహిత్యం, గానం, సంగీతం, ట్యూన్,  అంతా తీసివేసేలా ఉన్నా వర్మ స్టైల్ లోనే ఉన్నా- దాన్నెవరూ పట్టించుకున్న దాఖలాలు లేకపోగా, చరిత్ర జనాల మనసుల్లో దాగి ఉన్న, ఙ్జాపకాల దొంతర్లలోకి పదే పదే తీసుకెళుతుంటే ఓ మై గాడ్!

పాటలోని మాటతో పాటు వీడియోలో పదే పదే చూపించిన విజువల్స్ గుండె లను పిండేస్తుంటే విస్తుపోయి షాక్ కు గురౌతూ అలాగే చూస్తుండి పోయారు జనం. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ పతనానికి కారణం చంద్రబాబు నాయుడు అని అందరికి తెలుసు, కాని అదే సత్యాన్ని మాటలలో పొదిగి, వర్మ చేసిన మాయా జలంలో నాటి పాత్ర ధారులను, చిత్రమాలికలను ఏరి కోరి మరీ కూర్పు చేసిన తీరు, ఆ విధం చూస్తుంటే ఆయన తెగింపుకు ఆశ్చర్యం కలగక మానదు. 


వెన్నుపోటుగేయంలిరిక్

దగా! దగా!.. మోసం!..

నమ్మించినమ్మించి

వెన్నుపోటుపొడిచారు

వంచించివంచించి

వెన్నుపోటుపొడిచారు

కుట్ర కుట్ర కుట్రా!..ఆహా!

పొంచిపొంచిపడగలేయెత్తివీళ్ళు

కూతనీతివిషమునేచిమ్మినారు

దొంగప్రెమనటనలేచూపివీళ్ళు

కలియుగానశకునులైచేరినారు

దహించనీదురాగతంక్షమించసాధ్యమా!

కుట్ర కుట్ర కుట్రా!

అయినవాళ్ళుఒక్కరాత్రివదిలివేసినారు

అసలురంగుబయటపెట్టికాటువేసినారు

ఒంటరినేచేసిగుంపుదాడిచేసి

సొంతగూటినుంచికూడవెలివేసినారు

కుట్ర కుట్ర కుట్రా!

న్యాయమనేకోటనికాల్చితగలబెట్టినారు

నీతికేమొగొయ్యితీసిపాతిపెట్టినారు

గోతికాడనక్కలల్లేమాటువెసి

ఆత్మగౌరవాన్నిచంపిఆహుతిచేసినారు

కుట్ర కుట్ర కుట్రా!  

పొంచిపొంచిపడగలెయెత్తివీళ్ళు

కుటిలనీతివిషమునేచిమ్మినారు

దొంగప్రేమనటనలేచూపివీళ్ళు

కలియుగానశకునులైచేరినారు

దహించనీదురాగతంక్షమించసాధ్యమా!

కుట్ర కుట్ర కుట్రా!   

అధికారంలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇలా ఒక స్థాయిలో పెట్రేగిపోయి పడిపోయిన దర్శకుడు రాం గోపాల్ వర్మ మామూలోడు కాదు! చంద్రబాబును టార్గెట్ చేసి మరీ తన సినిమా ద్వారా నెగటివ్ ఇమేజ్ లో బంధించిన ఆయన ప్రయత్నం అనితరసాధ్యం.  అది సాహసం అనే పదానికి మించినది. కారణం ఈ తెలుగుజాతికి తెలిసిన చంద్రబాబు చరిత్రలోని దుస్సంఘటనలే. 


లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన పాట దుమారం రేపిన సంగతి తెలిసిందే. వెన్నుపోటు పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజలకు ఎన్టీఆర్ ఆత్మఘోష రూపంలో, చరిత్ర లోని, చిద్రమైన గతకాలపు మాసిపోయిన మరకలను మాగ్నిఫై చేసి మరీ కళ్ళకుకట్టినట్లు చూపినట్లుంది ఆ పాట. గతం తెలిసిన వారికి సినిమా రీళ్ళలా ఙ్జాపకాలు, కన్నీరు తెప్పించగా, ఈతరం వారికి చంద్రబాబు రాజకీయచరిత్ర చిత్రంలా కనిపించింది. 

అయితే దీనిపై తెలుగు దేశం పార్టీకి సహజంగానే కోపం వచ్చినా ఏం చేయగలరు? చరిత్ర చింపేస్తే చిరిగిపోయే పుస్తకం గాదు కదా!  ఏమీ అర్ధం కాని టిడిపి వాళ్లు వర్మపై  దుమ్మెత్తిపోయటం తప్ప!  ఇక మరి కొందరు చంద్రబాబు భక్తులు మరో అడుగు ముందుకు వేశారు. ఈ విషయంలో వర్మపై వీళ్లు కేసులు పెట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఏ సెక్షన్ల కింద వీళ్లు చేసిన ఫిర్యాదులు చెల్లుబాటవుతాతాయో? తెలియదు. 


కానీ, ఇలాంటి వారికి రామ్ గోపాల్ వర్మ మరో కౌంటర్ ఇచ్చాడు.  తాను చంద్రబాబును ఏమీ అనలేదని, చంద్రబాబుపై నాడు ఎన్టీఆర్ మాట్లాడిన మాటలకే పాటరూపం కల్పించామని, యూ-ట్యూబులో సవాలక్ష కాదు! లక్షల్లో నందమూరి చెప్పిన చంద్రబాబు చరిత్ర చిత్రాలున్నాయని - ఆర్జీవీ  చెబుతున్నాడు. చరిత్ర చెప్పినా గానం చేసినా నేఱం కాదుగదా! నేరమైతే చెప్పండి మహా ఐతే వర్మ సారీ! చెపుతూ దానికి కూడా కారణం చరిత్రగా మరో కథనం వినిపించగలడు వర్మ కోతి పుండును దాంతోనే బ్రహ్మరాక్షసి చేయించగలడు వర్మ! 

అయినా మన చరిత్ర నిండా మరకలతో ఉంటే ఎవరైనా ఏం చేయగలరు? మిత్రులు ఊర్కున్నా శత్రువులు వేటాడతారు గదా! రానున్న కాలం ఎంతో దయనీయం అంటున్నారు. ముఖ్యంగా కేసీఆరును కెలికి తెలంగాణా కచరా చేసుకున్న చరిత్ర - నరేంద్ర మోడీని గెలికి చేసుకున్న రాజకీయ వైఫల్యం ఏ తీరుకు దారి తీస్తుందో? అనేది  ఓటుకు నోటు కేసు న్యాయస్థానం ఫిబ్రవరిలో చెప్పవచ్చు. ఇంక ఏప్రిల్లో ఏపిలో, దేశంలో సాధారణ ఎన్నికలవరకు పోలవరం పట్టుసీమ ఇతర నీటిపారుదల పథకాలలో పారిన అవినీతి మురుగును ఎవరైనా బయటకు తీయవచ్చు. పాపాలన్ని ఒకేసారి పరిపక్వమై లక్ష్మిస్ ఎన్ టీఆర్ రూపంలో నందమూరి ఆత్మ, ఆ ఆత్మఘోషకు చరమగీతం పాడతారేమో?   


ఈ మేరకు ఎన్టీఆర్ ప్రసంగ పాఠాన్ని వర్మ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తనకు చంద్రబాబు నాయుడు పొడిచిన వెన్నుపోటు మీద ఎన్టీఆర్ ఎంత తీవ్రంగా రియాక్ట్ అయ్యాడో? అందరికీ తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ వెబ్ లో ఉన్నాయి. యూ-ట్యూబ్ లో చిక్కుతాయి. వాటినే వర్మ ఇప్పుడు తెలుగు దేశం పార్టీకి కౌంటర్ ఇవ్వడానికి వాడుకుంటున్నాడు. మరి సొంత అల్లుడు చంద్రబాబును ఎన్టీఆర్ ఎలా దూషించాడో? అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని టీడీపీవారు కాదన గలరా?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: