పవన్ కళ్యాణ్ కెరియర్ గురించి సంచలన కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ..!

KSK
తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరియు ఆయన పొలిటికల్ కెరియర్ పై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో..మరియు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.


తాజాగా ఇటీవల గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన నాదెండ్ల మనోహర్ గురించి రామ్ గోపాల్ వర్మ ప్రస్తావిస్తూ నాదెండ్ల మనోహర్ నుండి పవన్ కళ్యాణ్ కు వెన్నుపాటు తప్పదు, జాగ్రత్త అంటూ పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చాడు వర్మ.


అప్పట్లో నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు మహానేత ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన అంశాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడవకూడదు అని తిరుపతి బాలాజీని వేడుకుంటున్నా అంటూ ట్వీట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ.


ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేపట్టే ప్రతి యాత్రలో పక్కనే ఉండే నాదెండ్ల మనోహర్ అంతా గమనిస్తున్నాడని ఎన్టీఆర్ వెనుక ఉండి నాదెండ్ల భాస్కర్ రావు ఇలాగే చేశారని తాజాగా రామ్ గోపాల్ వర్మ ఆరోపించారు. ఏది ఏమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు నాదెండ్ల మనోహర్ మీద కన్నేసి ఉంచాలని సూచించారు రామ్ గోపాల్ వర్మ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: