"బ్లాంక్ చెక్" పై రాహుల్ సంతకం - ఏపి కాంగ్రెస్ చంద్రబాబుకు అంకితం

రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీలు పొత్తు పెట్టుకుంటాయా? లేదా? అనే అంశం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఇక పూర్తిగా తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ గాంధీ నిర్ణయాధికారాన్ని, పార్టీని, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల్ని చంద్రబాబుకు దఖలు పరచినట్లు తెలుస్తోంది.
 
నిన్న మొన్నటి వరకూ అద్యక్షుడు రాహుల్ గాంధీ వివిధ రాష్ట్రాల్లో పొత్తుల విషయంలో ఒక మాట చెప్పేవాడు. ఎక్కడైనా కాంగ్రెస్ —  ఏ ఇతర పార్టీలతో నైనా  పొత్తులు అనేవి పెట్టుకోవాలని అనుకుంటే ఆయా రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) నిర్ణయం మేరకు జరుగుతాయని, పీసీసీకి నచ్చితే ఇష్టమైతే ఏ రాష్ట్రంలో నైనా ఎవరితో నైనా  పొత్తుకు తమకు అభ్యంతరం లేదని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చాడు. 

అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ పొత్తు నిర్ణయానికి మినహాయింపునిస్తూ దాన్ని పిసిసికి కాకుండా టిడిపి అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అప్పగించేశాడట  రాహుల్. దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్  పీసీసీ ఇక చంద్రబాబు ఏం చెపితే అదే చేయాల్సి ఉంటుంది అలాగే ఆడాల్సి ఉంటుందని తెలుస్తోంది.
 
ఇక నుండి చంద్రబాబు నాయుడి స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే "ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ" పని చేయవలసి వస్తుంది. రాహుల్ గాంధి ఆదేశం ప్రకారం  "చంద్రబాబు పొత్తు పెట్టుకోవచ్చని తలిస్తే, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవచ్చు — అలా కాకుండా  ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏపీలో తెలుగుదేశంతో పొత్తు లేకుండా పోటీ చేస్తే అది టీడీపీకి మేలు చేస్తుందని అనుకుంటే, ఆ మేరకు ముందుకు వెళ్లవచ్చు"  రాహుల్ గాంధీ నారా చంద్రబాబు నాయుడుకు చెప్పాడట.
 
మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ ల పొత్తు ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడదు అనుకుంటే, ఏపీలో కాంగ్రెస్ టీడీపీల పొత్తు ఉండదు. తెలంగాణ ఎన్నికల అనంతరం ఈ వ్యవహారం ఒక కొలిక్కి రావొచ్చని తెలుస్తోంది. ఒకనాడు దేశాన్ని ఏక చత్రాధిపత్యంగా ఏలిన పార్టీకి నేడు వేరే పార్టీ అదుపాఙ్జల్లో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడటం రాహుల్ గాంధి సామర్ధ్యాన్ని మాత్రమే కాదు అసమర్ధతని సూచిస్తుంది. దీంతో ఏపి కాంగ్రెస్ లో చీము నెత్తురు ఉన్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ జెండా పీకేసి వేరే పార్టీలోకి చేరిపోయే పనిలో నిమగ్నమౌతున్నారట. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: