పరిగి లో సత్తా చాటిన 'రెడ్డి' - క్రౌడ్ చూస్తే తెరాస కి గుబులే !

KSK

పరిగిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన కాంగ్రెస్ నేత విశ్వేశ్వర రెడ్డి, టీఆరెఎస్ ప్రభుత్వపు పని తీరు పైన ఒక రేంజులో విరుచుకుపడ్డాడు. టీఆరెఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చని కారణంగా పార్టీ నుండి వీడి వచ్చినట్లు చెప్పిన ఈయన ఇప్పుడు వాటిని విడమరిచి ప్రజల ముందు బయటపెట్టారు. అసలు వీరు ఇచ్చిన హామీలు వీరికైనా గుర్తున్నాయో లేదో అంటూ చమత్కరించారు.



ముందుగా చెప్పినట్లు ఇంటింటికీ ఒక ఉద్యోగం కాదు కదా ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. ఇంక వీరు చేపట్టిన పథకాలు ఏదో కొత్తగా ప్రవేశ పెట్టినట్లు డప్పు కొట్టుకోవడం మానాలని హితవు పలికిన ఈయన, అంతా కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి పథకాలను వీరు కాపీ కొట్టి తెగ ఎగిరి పడుతున్నారని అన్నాడు. వీటిలో ఉచిత కరెంట్, 108, పావలా వడ్డీకే రుణాలు వంటివి ప్రవేశపెట్టి చేసి చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విస్మరించవద్దని కోరారు. కనీసం కాపీ కొట్టినవి కూడా సరిగ్గా చేయలేకపోయారు అని ఎద్దేవా వేశారు. 




మన జేబులో డబ్బులు దొంగతనం చేసి మళ్లీ మనకే సాయం చేసే వీరి ప్లాన్ భలే ఉంది అన్నారు ఈ ఎంపీ. చేవెళ్ల లో ఈయన హయాంలో ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధికి నోచుకుంది. అయితే మిగతా చోట్ల మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఇంక కాంగ్రెస్ ఎప్పటిలాగే ప్రయోజన సహితమైన పథకాలను ప్రవేశ పెడుతోందని, రైతు బిడ్డకు ఉద్యోగం, ముసలి వారికి నెలకు 2000 పింఛను, ఈ టీఆరెఎస్ ప్రభుత్వం లాగా కాకుండా సారి 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని సంచలనంగా ప్రకటించారు.



ఇక ఈ నాలుగున్నర ఏళ్లలో టీఆర్ఎస్ ఖజానాను ఖాళీ చేసింది కాకుండా అప్పులు మిగిల్చింది అని విమర్శించారు. ఈయన అన్నట్లు చూస్తే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ దిగడానికి కారణం ఇదే కావచ్చు. ఈ అప్పు లక్కగడితే తెలంగాణ ప్రజల్లో తలా 60,000 అప్పు ఉంది అన్నారు. ఇలా చాకచక్యంగా వ్యవహరించి మాట్లాడుతూ ప్రత్యర్ధులను కోలుకోకుందా దెబ్బ తీయడంలో కెవీఆర్ స్టైల్.


నిజాన్ని సూటిగానే కాకుండా చమత్కరిస్తూ ఆయన ప్రజల వైపు మాట్లాడుతూ ఉత్సాహభరితంగా ఆలోచింపజేస్తారు. ఇక ఈ కాపీ పథకాలకు టీఆరెఎస్ స్వస్తి చెప్పి కొత్తగా ఆలోచించాలి ఏమో చూడాలి. అయినా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి నాయకులు అవతల పక్క ఉంటే ఇంకా వీళ్ళకి పథకాలు పన్నడానికే సమయం చాలదు ఇంక కొత్త పథకాలు అమలు చేసే టైం ఎక్కడిది?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: