బ్రేకింగ్: ఏపీ రాజకీయాల్లో సంచలనం కొత్త పార్టీ పెట్టబోతున్న జేడీ లక్ష్మీనారాయణ…?

KSK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం రోజు రోజుకి మారిపోతుంది ఇప్పటికే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరియు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి మరో పార్టీ అయిన జనసేన ఏపీ రాజకీయాలలో రసవత్తరం చేస్తున్న నేపథ్యంలో కొత్తగా మరో పార్టీ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.


గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా వ్యవహరించిన జేడీ లక్ష్మీనారాయణ వైసీపీ అధినేత జగన్ కేసులలో కీలకంగా వ్యవహరించే అప్పట్లో వార్తలు సంచలనంగా మారారు. అయితే ఏపి లో ఆయన పదవీకాలం ముగియడంతో  మహారాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ అయ్యారు.


ఈ క్రమంలో సమాజంలో మార్పును తీసుకు రావాలని తన పదవికి రాజీనామా చేసి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులతో ప్రతిచోటా సమావేశాలు నిర్వహించి ముందుకు సాగారు ఇదే క్రమంలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలు అనేక చోట్ల కళాశాలలో నిర్వహించారు. దీంతో జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని ఇలా అనేక వార్తలు వినపడ్డాయి.


అయితే తాజాగా వీటన్నింటికి తెర దించుతూ... తానే సొంతంగా పార్టీ పెట్టాలని జేడీ లక్ష్మీనారాయణ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వ్యవవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలే ప్రధాన అజెండాగా ఆయన పార్టీ ఉండనుంది. ఈ నెల 26న కొత్త పార్టీ పేరును ప్రకటించి.. లక్ష్యాలు, అజెండాను లక్ష్మీనారాయణ ప్రజలకు వివరిస్తారని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: