తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!

siri Madhukar
ప్రపంచంలో పురాతన కాలం నాటి చిత్ర పటాలకు ఎంతో ఆదరణ ఉంది..ఆ కాలం నాటి చిత్రాలంటే ఇప్పటికీ కొత్తదనంగానే కనిపిస్తుంటాయి.  సాధారణంగా  పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాల్లో ఎన్నో అద్భుతమైన కళాఖండాలు బయట పడుతున్నాయి.  కొన్ని వేల సంవత్సరాల నాటి వస్తువులు..వందల సంవత్సరం నాటి చిత్ర పటాలు బయట పడుతున్న విషయం తెలిసిందే.  తాజాగా ఒకటవ శతాబ్దం నాటి అద్భుత పెయింటింగ్ ఒకటి ఇప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేసింది.  స్పార్టన్ రాణి లెడా, హంస రూపంలో ఉండే జ్యూస్ దేవుడి మధ్య లైంగిక బంధం గురించి పురాతన కథల్లో వివరించబడ్డాయి..కానీ వాటికి వాస్తవరూపం ఎక్కడా లేదు. 

తాజాగా ఇప్పుడు అందుకు సంబంధించిన వర్ణ చిత్రం వెలుగులోకి వచ్చింది. ఒకటవ శతాబ్దంలో ఓ అగ్నిపర్వతం పేలిన వేళ, బూడిదలో కూరుకుపోయిన పురాతన రోమ్ నగరం పొంపేయిని గుర్తించిన శాస్త్రవేత్తలు, తవ్వకాలు సాగిస్తున్న వేళ, లేడా బెడ్ రూమ్ ను గుర్తించారు.  అక్కడే ఈ చిత్ర పటం బయట పడింది.  ఇప్పటికీ ఈ చిత్ర పటం సహజత్వం ఎక్కడా పోలేదు.  ఈ చిత్ర పటంలో  అర్ధనగ్నంగా ఉన్న లెడా, ఓ కుర్చీపై కూర్చుని ఉండగా, ఆమెను తెల్లని హంస ఒకటి ముద్దాడుతూ ఉంది.

ఆ కాలంలో ప్రజలు జంతువులతో లైంగిక బంధాన్ని కలిగివున్నారనడానికి ఈ చిత్రం ఓ నిదర్శనమని పొంపేయి ఆర్కియాలజికల్ పార్క్ డైరెక్టర్ మాసిమో ఒస్నాన వ్యాఖ్యానించారు.  అప్పట్లో పొంపేయి నగరంలో కొన్ని చిత్రపటాలు బయట పడ్డాయి..వాటితో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంది. కాగా, లెడాపై గ్రీస్, రోమ్ దేశాల్లో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె అందానికి ముగ్దుడైన జ్యూస్ దేవుడిని తన పాదాక్రాంతం చేసుకుందని..తన భర్తతో కలసి నిద్రిస్తున్న వేళ, హంస రూపంలో వచ్చిన జ్యూస్ ఆమెపై అత్యాచారం చేశాడన్న మరో కథ కూడా ప్రచారంలో ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: