శబరిమల ప్రవేశం కంటే మహిళలకు ముఖ్య సమస్యలు లేవా? బంగ్లా రచయిత్రి తస్లిమ నస్రీన్

తస్లిమా నస్రీన్‌, వివాదాస్పద బంగ్లా రచయిత్రి, "దేశంలోని స్రీలు గృహహింస, అత్యాచారం, వేధింపులు, ఆరోగ్యం, ఉద్యోగం, స్వేచ్ఛవంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వాటిని పరిష్కరించేందుకు గ్రామాల్లో పోరాడాల్సిన మహిళాకార్యకర్తలు శబరిమల ఆలయ ప్రవేశానికి పోరాడటం విడ్డూరంగా ఉంది"  అని ఆమె మరోసారి ట్విట్టర్‌ వేదికగా గళం విప్పారు.  మహిళా సమస్యలు ఇంతకంటే ముఖ్యమైనవని ఆమె వ్యక్తీకరించారు 

కేవలం ఆలయ ప్రవేశానికి మహిళలు అంత అత్యుత్సాహం చూపించటాన్ని, ఆ అవసరం లేదని ఆమె విమర్శించారు. దాని ద్వారా సాధించేది ఏముందని భావగర్బితం గా ట్వీట్ చేశారు. మహిళలు తమను అభ్యుదయ పథంలో నడిపించే విషయాలపై ఉత్సాహం చూపాలనే భావన ద్వనించింది.


ఇదిలా ఉండగా శబరిమల అయ్యప్ప స్వామిని ఎలాగైనా దర్శించుకు తీరుతానన్న సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌కి కోచి విమానాశ్రయంలో అయ్యప్ప భక్తులు నుంచి తీవ్ర నిరసన సెగ తగిలింది. ఆమెను ఆలయం లోకి ప్రవేశించకుండా విమానాశ్రయంలో అడ్డుకోవటంతో చేసేది ఏమి లేక తన వెంట వచ్చిన వారితో సహా తృప్తి దేశాయ్‌ ముంబైకి తిరిగి వెళ్లి పోయారు. శబరిమలలో మహిళలందరికి కూడా దేవాలయ ప్రవేశం కలిపిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఋతుక్రమం కలిగిన మహిళలలకు  కూడా అందరితో సమానంగా ప్రవేశం కల్పిస్తూ తమ తీర్పులో అవకాశమిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. 


శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసు మహిళలు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కొందరు వెళ్లేందుకు ప్రయత్నించగా అయ్యప్ప స్వామి భక్తులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నసంగతి తెలిసిందే. దారి మధ్యలోనే మహిళలను అడ్డుకుని వెనక్కిపంపారు. ఈ నేపథ్యంలో తస్లిమా నస్రీన్ మహిళా కార్యకర్తలను ఉద్దేశించి పై ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: