జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలతో పవన్ పరువు గంగలో కలిసి పోతుందే...!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ ఆరోపణలు వింటుంటే ఎవరికైనా అతని అజ్ఞానం ఏంటో ప్రతి ఒక్కరికి అర్ధం అయిపోతుంది. హత్యాయత్నం' ఎపిసోడ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై సానుభూతి కురిపించినట్లే కురిపించి, ఆ 'చిన్న' ఘటనను సాకుగా చూపి, జగన్‌ హైద్రాబాద్‌కే పరిమితమైపోయారంటూ పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. గాయం చిన్నదా.? పెద్దదా.? అన్నది జగన్‌ని పరామర్శిస్తే పవన్‌కళ్యాణ్‌కి అర్థమయ్యేదేమో. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే, పరామర్శించే తీరిక పవన్‌కళ్యాణ్‌కి లేకపోవడమే ఆశ్చర్యకరం.


ముఖ్యమంత్రి బాధ్యత లేని వ్యక్తి.. అది అందరికీ తెలుసు. ఆయనతో నాలుగేళ్ళు చెట్టాపట్టాలేసుకు తిరిగిన వ్యక్తి కదా.. అందుకే, పవన్‌కళ్యాణ్‌ కూడా అదే బాటలో వ్యవహరిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఓ వైపు శ్రీకాకుళం జిల్లాని తితిలీ తుపాను అల్లకల్లోలం చేస్తే, తాపీగా పవన్‌కళ్యాణ్‌ గోదావరి నదిపై కార్యకర్తలతో 'క్యాట్‌ వాక్‌' అదేనండీ, 'కవాతు' నిర్వహించిన విషయం విదితమే. ఆ తర్వాత వెల్లువెత్తిన విమర్శలతో శ్రీకాకుళం వెళ్ళి, బాధితుల్ని పరామర్శించేసి హడావిడి చేసిన పవన్‌కళ్యాణ్‌, తనలా వైఎస్‌ జగన్‌ హడావిడి చేయలేదంటూ గుస్సా అవడం రాజకీయంగా పవన్‌ 'వివేకాన్ని' ప్రశ్నిస్తోందిప్పుడు.


ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కురసాల కన్నబాబు, ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఆ కురసలా కన్నబాబు మీద అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా పవన్‌కళ్యాణ్‌ ఏం సంకేతాలు పంపిస్తున్నట్టు.? పవన్‌ ఆరోపణలు చేశారు, కురసాల కన్నబాబు స్పందించారు.. మరి, కురసలా కన్నబాబు వ్యాఖ్యలపై పవన్‌ కళ్యాణో, ఆయన అనుచరగణమో కౌంటర్‌ ఇవ్వాలి కదా.! చంద్రబాబుకీ కాదు, వైఎస్‌ జగన్‌కీ కాదు.. తనకు ఓసారి అవకాశం ఇచ్చి చూడాలన్నది పవన్‌కళ్యాణ్‌, 'జనసేన పోరాట యాత్ర' సందర్భంగా ప్రజలు ఇస్తోన్న పిలుపు. ఎందుకు ఇవ్వాలి.? అమరావతి రైతుల తరఫున నిలబడలేదు, నాలుగేళ్ళుగా టీడీపీ అవినీతిని నిలదీయలేదు.. చంద్రబాబుకి ఎప్పుడెక్కడ సమస్య వచ్చినా, అక్కడ వాలిపోయి 'ట్రబుల్‌ షూటర్‌'గా వ్యవహరించి, చంద్రబాబు సర్కార్‌ని కాపాడారాయె.!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: