శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తమిళ ‘టెంపర్’..!
ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా హిట్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ తిరిగి ట్రాక్ లో పడటంతో ప్రస్తుతం 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా కూడా సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ అవడంతో మంచి జోష్ మీద ఉన్నాడు జూనియర్.
ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కి భారీ హిట్ ఇచ్చిన ‘టెంపర్’ సినిమాను కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ విశాల్ రీమేక్ చేస్తున్నాడు. తమిళ సినిమా రంగంలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విశాల్ ఈ సినిమాను మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు.
ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇటీవల విశాఖపట్టణం లో కొంత షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సినిమాల్లో అత్యంత కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు..సినిమా యూనిట్. ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, విశాల్ సరసన రాశి ఖన్నా కనిపించనుంది. పార్తీబన్ కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.