సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్..!

KSK
ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో తిత్లి తుఫాను నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటూ ఏపీ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు.


తాజాగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం బ్యారేజీ పై తన పార్టీ తరపున నిర్వహించిన కవాతు విషయమై తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు..ఒక పక్క రాష్ట్రంలో తుఫానుతో ప్రజలు అల్లాడుతుంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలకోసం.. నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ని విమర్శించారు.


 ఇదే క్రమంలో ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబు తుఫాను బాధిత ప్రాంతంలో పర్యటిస్తూ చేసింది గోరంత సహాయం ప్రచారం చేసుకునేది కొండంత అంతగా వ్యవహరించడంపై విపక్ష పార్టీలు కూడా తెలుగు దేశం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.


ఈ సందర్భంగా తనపై వచ్చిన కామెంట్లపై పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు ఆటంకం కలుగకూడదని పర్యటన ఆలస్యం చేశాను. అంతేకానీ కవాతు కోసం కాదు. టీడీపీ శ్రేణులు మా పర్యటనను విమర్శించడం మానుకోవాలి. మీ గెలుపులో మా పాత్ర కూడ ఉందని మర్చిపోకండి అంటూ చురకలంటిచారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: