"సంపద నుండి చెత్త సృష్టించటం" లోకెష్ కాన్సెప్ట్ అర్ధంచేసుకోని అఙ్జానులు నెటిజెన్స్?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వరపుత్రుడు, బాబు వస్తే జాబ్ వస్తుందన్న పథకంలో, ఉద్యోగం పొందిన ఒకే ఒక్క ఆంధ్రుడు, మన ఐటీ శాఖా మాత్యులు నారా లోకేష్ ప్రతిభ నిరంతరము అభినందనీయమనేది సకల జనులకు విదితమే. ఎంతటి మహనీయులంటే వర్దంతిని జయంతి చేయగల సమర్ధులు అలాగే చెత్త నుండి సంపదకు బదులు, సంపదనే చెత్తగా మార్చగల ప్రఙ్జాపాఠవాలను ఒడిసి పట్టిన గండరగండడు.  




చెత్త నుండి సంపదకి బదులు సంపద నుండి చెత్త సృష్టించ గల సామర్ధ్యం కలిగిన వారెవరైనా ఉన్నారా? ఈ భూమ్మీద. అంతటి మహనీయులు కాబట్టే ఒకే ఒక్క జాబు “బాబొస్తే జాబొచ్చే స్కీం” లో ఎంపిక కాగలిగారు. అది తెలియని నెటిజెను లెంత నిర్దయులు? ఆయన లోని విఙ్జానాన్ని గుర్తించలేక అఙ్జానులు అయిపోయారు. ఆయన కదన కుతూహలమే నేడు సినిమాల్లో బ్రహ్మానందం గారు నటించటం తగ్గించేసినా జీవితంలో ఆ లోటును భర్తీ చేస్తూ తెలుగు ఆబాలగోపాలానికి వినోదం త్రిపుల్ అదే ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్,ఎంటర్టైన్మెంట్ నిరంతరం అందిస్తూనే ఉన్నారు. 

ఆయనగారి ఈ భాషా పరిఙ్జానం గురించి రాస్తూ పోతే'విశ్వనాధ వారి వేయిపడగలంత ఉద్గ్రంధమే అవుతుంది.  లోకేష్ బాబు ఖ్యాతి గురించి ఇప్పటికే పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తూ సోషల్ మీడియాలో గతంలో సెటైర్లు పేలటం ప్రతితోజూ కకపోయినా అప్పుడప్పుడూ చదువుతూనే ఉన్నాం. ఆయన బాషా పాండిత్యం దినదిన ప్రవర్ధమా నమై ఆయన తీరుతెన్నుల్లో వన్నె చిన్నెలు పేరిగి జయంతిని వర్ధంతి చేయడం, సంపదను చెత్త చేయటం వరకు కొనసాగగా, ఇక అఙ్జానులకు అర్ధ మయ్యే పరిఙ్జానం  తన ప్రసంగాల్లో పొంగిపొర్లటానికి ప్రత్యేక తరగతులు పెట్టించు కోవడం జరిగినా లోకేష్ రూటే సెపరేటు అంటున్నారు నెటిజెన్స్. 

తాను మాట్లాడేటపుడు చెప్పిందే వినాలని, వాదనలు చేయకూడదని అగ్రిగోల్డ్ బాధితులపై కామెంట్స్ చేసిన లోకేష్, నేనాడిందె ఆట, నేపాడిందే పాట, నేపలికిందే మాట అంటూ .. ....తాజాగా మరోసారి ఈ చెత్త కామెంట్ చేసి నెటిజన్ నెట్లో పడిపోయారు. 


సంపద నుంచి చెత్తను సృష్టించడం  అనే బృహత్కథా వైభవాన్ని ఒక “ కాన్సెప్ట్” గా  పరిచయం చేయటానికి ఈ చినబాబు శ్రీకారంచుట్టారు. బుధవారం నాడు విజయవాడ లో జరిగిన “స్వచ్ఛతే సేవ” కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తన ఫేస్-బుక్ ఖాతాలో చినబాబు చేసిన ఈ చెత్త పోస్టింగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

-రాష్ట్ర వ్యాప్తంగా 20వేల కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మిస్తామని - తద్వారా వేస్ట్ మేనేజ్ మెంట్ కు శ్రీకారం చుడతామని చినబాబు సెలవిచ్చారు.  

-ఆ క్రమంలోనే చెత్త నుంచి సంపద సృష్టిస్తామని చెప్పబోయి, సంపద నుంచి చెత్త సృష్టిస్తామని చెప్పి యథావిధిగా ఈ చిన నిప్పుగారు ఎప్పటిలా “పప్పు” లో కాలేశారు. ఆ   పోస్ట్ చూసిన నెటిజన్లు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. 

-చాలా కాలం నుంచి చినబాబు లోకెష్ అపహాస్య చతురత కోల్పోయిన నెటిజన్లు, తమ వెటకారానికి బహుచమత్కారం జోడించి ట్రోలింగ్ మొదలెట్టారు. అయితే లోకెష్ బాబు చెత్త కాన్సెప్ట్ లో దాగున్న మర్మాన్ని నెటిజన్లు గుర్తించలేకపోయారు. 

వాస్తవానికి సంపద నుంచి చెత్తను సృష్టించడమనే ఈ కుమార బాబు విజన్ ను వారు పసిగట్టలేకపోయారు. పచ్చటి పంటలు పండే పొలాలను బీడులుగా మార్చడం భూము లు అప్పజెప్పని వారి పంటలకు నిప్పుపెట్టడం, ఇదంతా ఆ కాన్సెప్ట్ లో భాగమే.

అమరావతి బాండ్ల అత్యధిక వడ్డీ రేట్లతో విడులచేసీ అవి ఓవర్ సబ్స్క్రైబ్ అయితే అది తమ గొప్పగా చెప్పుకున్నారు తద్వారా రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం, ఇవి చాలక అందిన వరకు దోపిడీ చేసి రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టడం కూడా ఆ కాన్సెప్ట్ లో భాగమే. 


ఇసుక దోపిడీ - బాబు - చినబాబుల విదేశీ పర్యటనలు -
అవసరం లేకపోయినా ప్రత్యేక విమానాలలో స్వైర విహారం
బాబుగారి స్నానం ఖర్చులు – 
బాబుగారి ఉపవాసం ఖర్చులు – 
ధర్మ దీక్షలు - పోరాట యాత్రలు – 
అమాత్యుల పన్నుపోటు ఖర్చులు.. 


ఇవన్నీ కూడా సంపద నుంచి చెత్త సృష్టించే మార్గాలేనని ప్రజలు - నెటిజన్లు గుర్తించలేక పోవడం దురదృష్టకరం. కాబట్టి చినబాబు ఆచితూచి ఆలోచించి చేసిన ఆ చెత్త కామెంట్ లో దాగున్న అర్థాన్ని తెలుసుకోకపోవడం, నెటిజన్ల అజ్ఞానం మాత్రమేనని చెప్పక తప్పదు. 


ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశం మొత్తం వెదికినా లోకేష్ అంతటి లోక జ్ఞానం ఉన్న రాజకీయ నేత మరొకరుండరంటే అతిశయోక్తి కాదేమో! ఆయన అందునా ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం విద్యార్జన నేర్పిన గొప్ప విద్య ప్రభావమే ఇది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: