పవన్ స్ట్రోక్ వారికి బాగానే తగిలినట్లుంది...!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ ను నమ్ముకొని తెలంగాణ ఎన్నికలను ఎదుర్కోవాలని సీపీఎం కలలు కనింది అయితే ఇప్పుడు ఆ కలలు కలలుగా మిగిలిపోయినట్టున్నాయి. తమ్మినేని వీరభద్రం.. ఈ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భుజాల మీద సవారీ చేసి.. విజయాలు నమోదు చేసుకోవాలని కలలు కన్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ అభిప్రాయాన్ని చెప్పక ముందునుంచే.. తమ సారథ్యంలో ఏర్పడిన సీపీఎం బహుజన కూటమిలోనే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కూడా ఉంటుందని.. తామంతా కలిసి పోటీచేస్తాం అని ఆయన ప్రకటించేశారు.


కానీ సీపీఎం ప్రతిపాదనను పవన్ ఏమాత్రం పట్టించుకోలేదు. వారు ప్రతిపాదించారు గనుక.. ఆఫీసు దాకా రానిచ్చారు. పవన్ తరఫున ఆయన రాజకీయ వ్యూహకర్తలు మాట్లాడారు. ‘పవన్ తో మాట్లాడి చెప్తాం’ అంటూ తిప్పి పంపారు. పవన్ అందుబాటులోకి వచ్చాక.. ఓ రోజున సీపీఎంను చర్చలకు రమ్మన్నారు గానీ.. సదరు భేటీ జరగనేలేదు. సీపీఎంతో  జట్టు కడతానో లేదో అని పవన్ తేల్చి చెప్పనే లేదు. తనంతట తాను ఏపీలో యత్రకు వెళ్లిపోయారు.


ఎదురుచూసి ఎదురుచూసి అలసిపోయిన తమ్మినేనికి, ఇన్నాళ్లకు క్లారిటీ వచ్చినట్లుంది. జనసేన ప్రస్తావన లేకుండా.. బహుజన వామపక్ష కూటమి గురించి ఆయన తొలిసారిగా మాట్లాడారు. అయితే తమ్మినేని ఈ కూటమి ద్వారా తామెన్ని సీట్లు గెలవగలం అని అనుకుంటున్నారో తెలియదుగానీ... మహాకూటమి మాత్రం బూటకం అని వ్యాఖ్యానిస్తున్నారు. కోదండరాం మహాకూటమిలో ఉంటూనే.. ఇటు భాజపాతో కూడా చర్చలు జరుపుతున్నారని ఎద్దేవా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: