పాదయాత్ర లో సంచలనం..! జగన్ ఇచ్చిన హామీతో సంతోషం..!

KSK
వైసీపీ నేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఇప్పటికే మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుని చివరి దశకు చేరుకుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు చేయని విధంగా జగన్ ఈ పాదయాత్ర చేయడంతో ప్రజలలో జగన్ పై మరింత విశ్వాసం పెరిగింది. తమ తండ్రి చనిపోయిన తన కుటుంబాన్ని రాజకీయంగా ఇబ్బందులు పెట్టినా తన తండ్రిని ఆదరించిన రాష్ట్ర ప్రజల కోసం జగన్ ఎండలోనూ వానలోనూ చలిలోనూ పాదయాత్ర చేయడం మామూలు విషయం కాదని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు పేర్కొంటున్నారు.


ముఖ్యంగా జగన్ మీద గతంలో తెలుగుదేశం పార్టీ రాసిన అవినీతి ఆరోపణలను ఎవరు నమ్మటం లేదు. దీంతో జగన్ ఎక్కడ అడుగుపెట్టిన జనాలు ఇసుకరేణువుల వల్లే సభలకు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.  రాజన్న బిడ్డ మా పల్లెకు వోచారు అని మురిసిపోతున్నారు . రాజన్న రాజ్యం జగన్ అన్న తోనే సాధ్యం అంటున్నారు.


పాదయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా లో ఇటీవల కార్మికులు తో మమేకం అయినా జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన కార్మికులు, జూట్‌ మిల్లులు సంక్షోభంలో ఉన్నాయని ఆందోళన, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలకూ నోచుకోలేదని ఆవేదన చెందారు.


మరోపక్క అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు ఇవ్వడం లేదని వృద్ధులు కన్నీటిపర్యంతం అయ్యారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జననేత. వాళ్ళ సమస్యల పరిష్కరిస్తాను అని భరోసా ఇచ్చారు. దీంతో జగన్ ఇచ్చిన హామీతో కార్మికులు అంతా సంతోషపడ్డారు. కచ్చితంగా రాబోయే ఎన్నికలలో జగన్ ని ముఖ్యమంత్రి చేసుకుంటామని పేర్కొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: