బ్రేకింగ్ న్యూస్: ఇండియా టుడే 2018-19 ఎలక్షన్ సర్వే మోడీ - కెసిఆర్ హిట్ - చంద్రబాబు ఫట్

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు రానున్న మయ్ లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారో తెలియజేస్తూ "ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా" ఒక సర్వే విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి - ముఖ్య మంత్రి అవ్వడం ఖాయమని తెలుస్తోంది. కచ్చితంగా వైసీపీనే అధికారం లోకి వస్తుందని సర్వేలో పేర్కొంది.


ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయానికి వస్తే: 




*జగన్మోహనరెడ్డికి 43% మంది ఓటేశారు. 
*చంద్రబాబుకు 38%, 
*జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌కు 5% మద్దతిచ్చారు.

ఈ నెల 8 నుంచి 12 తేదీల్లో అయిదు రోజుల పాటు  దాదాపు 10,650  మంది నుంచి సమాచారం సేకరించారు. ఈ సర్వేలో:


*టీడీపీ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతప్తితో ఉన్నట్టు తేలింది.

*వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి ఎదురు దెబ్బ తప్పదని, 

*కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి  వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమైంది.

*ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన "మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం.....ఎక్కడా ప్రస్తుత ముఖ్యమంత్రి కంటే ప్రతిపక్ష నేతకు ఎక్కువ శాతం ఓట్లు రాలేదు"

*ఈ రాష్ట్రాలను వదిలెస్తే ఆంధ్ర ప్రదెశ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ముఖ్యమంత్రి కంటే ప్రతిపక్ష నాయకునికే అధిక ఓట్లు వస్తాయని తేలింది. అంటే ప్రస్తుత ముఖ్యమంత్రికి ఝలక్ ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు   

ఈ సర్వేపై శుక్రవారం రాత్రి ఇండియా టుడే ఛానెల్‌లో - పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ - పి ఎస్ ఈ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమాన్ని సీనియర్‌ జర్నలిస్టులు రాజ్‌దీప్‌ సర్దేశాయ్, రాహుల్‌ కన్వల్‌ నిర్వహించారు. ఇండియా టుడే సర్వేలో భాగంగా తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న సూటి ప్రశ్నకు 43% మంది జగన్మోహనరెడ్డికి అనుకూలంగా ఓటేశారని వారు వెల్లడించారు.


*36% చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై బాగాలేదని,
*18% ఓ మోస్తరుగా ఉందని స్పష్టం చేశారన్నారు.


ఈ సర్వేలో

*ప్రధాని నరేంద్ర మోడీకి తిరుగులేని విజయం సాధిస్తారని తెలిసింది. ప్రధానిగా నరేంద్ర మోడీకి 55 శాతం మంది. రాహుల్ కు 42 శాతం మంది ఓటు వేసినట్లుగా సర్వే వెల్లడించింది. కేంద్రంలోనూ,  తెలంగాణలోనూ అధికారపక్షంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ, అందుకు భిన్నంగా తిరుగు లేదన్నట్లుగా ఫలితాలు వెల్లడిస్తున్న సర్వే ఫలితాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 


కేంద్రంలో మోడీ పని తీరు ఎలా ఉందన్న ప్రశ్నకు తెలంగాణ వ్యాప్తంగా బాగుందన్న వారు 41 శాతం మంది చెప్పగా,  బాగోలేదని చెప్పిన వారు 32 శాతం మంది ఫర్వా లేదని చెప్పిన వారు 24 శాతం మందిగా పేర్కొన్నారు. తదుపరి ప్రధానిగా ఎవరు అయ్యే అవకాశం ఉందన్న ప్రశ్నకు మోడీకే తెలంగాణ ప్రజలు ఓటు వేశారు. మోడీకి 44 శాతం మంది సానుకూలంగా స్పందిస్తే, రాహుల్ గాంధీకి 39 శాతం మంది. కేసీఆర్ కు 11 శాతం మంది ఓట్లు వేశారు.


*తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు 43 శాతం మంది తెలంగాణ ప్రజల మద్దతు ఉన్నట్లుగా ప్రకటించింది. కేసీఆర్ తర్వాత ఉత్తమ్ కుమార్ ఉన్నారు. ఉత్తం కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వారు కేవలం 18 శాతం మందే కావటం గమనార్హం.  పొలిటికల్ స్టాక్ ఎక్సైంజ్ పేరుతో అన్ని ఎంపీ స్థానాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 7110 మంది ప్రజలు పాల్గొన్నట్లు సదరు మీడియా సంస్థ పేర్కొంది. కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లుగా 11 శాతం మంది చెప్పగా, పరిసరాల పరిశుభ్రత నిరుద్యోగం, వ్యవసాయంలో ఇబ్బందులు, నిత్యావసరాల ధరల పెరుగుదల తమకు ప్రధాన సమస్యలుగా ప్రజలు పేర్కొన్నట్లు వెల్లడించారు. 


*అదే సమయంలో ఈ మధ్యనే కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కుమారస్వామిపై కన్నడిగులు అసంతృప్తితో ఉన్నట్లు తేల్చింది. కర్ణాటక ప్రభుత్వ పని తీరు బాగుందన్న వారు కేవలం 23  శాతం మంది కాగా,  ఫర్వాలేదన్న వారు 28 శాతమైతే, ఏ మాత్రం సంతృప్తికరంగా లేదన్న వారు 35 శాతం మంది కావటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: