ఎడిటోరియల్: గోదావరిని జయించిన జగన్ - ఏజన్సీలో రగుల్తున్న నిశ్శబ్ధవిప్లవం

ఆయన జగన్ కాదు జనం. ఆయన ఎక్కడ అడుగెట్టినా నేల ఈనిందా? నింగి నుండి జనవర్షం కురిసిందా? అన్నట్లు జనమే జనం. చీమల దండు వచ్చినట్లే పది పదిహేను వేల జనం కూడా లేని గ్రామంలో జోరున వర్షం కురుస్తున్నా రెండు లక్షలకు పైగా జనం జగన్ చుటూ మూగి పోవటం ఆయన సందేశాల కోసం తడిసి పోతూ ఎదురు చూడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుందంటున్నారు విశాఖవాసులు.  

ఏమిటీ జనం?  ఎక్కడిదీ ఈ ప్రభంజనం?  శాసనసభ విపక్షాల సభ్యులను చెరబడు తున్నవేళ సభాపతి దృతరాష్ట్రుడైనవేళ  ధారుణ మోసాలకు, అనైతిక సంస్కృతికి పట్టం కట్టినప్పుడు, దాన్ని దానికే వదిలేసి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైసిపి అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి విశాఖ జిల్లాలో చేస్తున్న పాద యాత్రకు జనం గంగవెర్రులెత్తిన గోదారిలా వెల్లువెత్తుతున్నారు.

పల్లె పట్నం నగరం  అనేకాదు ఆయన ఎక్కడ అడుగెట్టినా జనవిస్పోటనమే. అయితే ముందే ప్రజా సంకల్పయాత్రతో ఉభయ గోదావరి జిల్లా ఆయన సభలకు వచ్చిన జనాన్ని చూసిన అధికార టిడిపి నాయకులకు తమ అగమ్య గోచర భవితవ్యం మాయాదర్పణంలో కనిపించినట్లు కంపించిందని అంటున్నారు.  

కాపులకు రిజర్వేషన్లపై ఎలాంటి రాజకీయ దురుద్దేశ్యాలు లేకుండా జగన్ చేసిన ప్రకటనకు యువత సానుకూలంగా స్పందించిందనిపిస్తుంది. ఆయన ప్రకటనలోని నిజాయతీగా నమ్మింది. దీంతో జగన్ ను వైసిపిని ఇరుకున పెట్టాలని భావించిన టిడిపికి నోట్లో పచ్చి  వెలక్కయ పడింది అనేకంటే, మట్టి మస్తుగా పడిందని అతి సామాన్యులు కూడా నమ్ముతున్నారు. 

ఎండా వాన వెరపు బెరుకు లేకుండా వస్తున్న జన స్పందన చూసిన అధికార పార్టీ నాయకులకు అన్నీ చోట్ల ముచ్చెమటలు పోస్తున్నట్లు మౌత్ టూ మౌత్ ప్రచారమతుంది. టిడిపి వారికి నోట మాట రావడం లేదట. ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ ప్రజా సంకల్ప యాత్ర సభలకు వచ్చిన జనం వైసిపి ఇచ్చే సొమ్ములకోసమో, బిర్యానీ పొట్లాల కోసమో, మందు బాటిళ్ల కోసమో వచ్చినవారు కాదని ఘంటాపథంగా చెపుతున్నారు జనం. అందులో ప్రజలు నిజమైన భరోసా యివ్వగల వ్యక్తిని జగన్లో చూస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయని అక్కడిజనం చెపుతున్నారు.  ఇంత మీడియా బలమున్నా టిడిపికి ఆ బలం నిస్సారమౌతుంది.  మౌత్ టూ మౌత్ సాగే  వైసిపి అనుకూల నిశ్శబ్ధ ప్రచారం ముందు మీడియా బలము వెలవెల పోతుందని అంటున్నారు. మీడియా అనే అరచేతిని అడ్డేసి వైసిపి జనాభిమానాన్ని, ఎన్నికల్లో ఈసారి టిడిపి అడ్డుకోవటం, అసాధ్యమనే అంటున్నారు. 
 

ఉభయ గోదావరి జిల్లాల జనస్పందనతో దాని ప్రదర్శన ప్రభావం జగన్ పై ఇతర జిల్లాల్లో కూడా నూతన ఆశలకు ప్రోదిచేస్తున్నాయి. జనం పెరుగుతున్నారు అనటానికి జోరువానతో, పోటెత్తే వరదతో, విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన జగన్ కు అక్కడి ప్రజలు హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబు తీరుకు విసుగెత్తిన జన దృక్పథం ముఖ్యంగా ఏజెన్సీ గేట్-వే అయిన నర్శీపట్నం పక్కనున్న చిన్న చిన్న గ్రామాలైన కోటవురట్ల - నక్కపల్లిలో సోమవారం జరిగిన పాదయాత్రకు వచ్చిన అనూహ్య స్పందనతో జిల్లా టిడిపి నాయకుల గుండెల్లో ఝలధరింపులు దఢ పుట్తిస్తున్నాయి. 

ఈ గ్రామాల జనాభా కనీసం 15 వేలు కూడా దాటదు. అయ్తే ఇతర ప్రాంతాలనుండి ఆ రెండు గ్రామాలకు వచ్చిన వారి సంఖ్య దాదాపు రెండు లక్షల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఇసుక వేస్తే రాలనంత జనం రాగా, వారిపట్ల జగన్ ప్రవర్తించిన తీరు కూడా హృద్యమం అంటున్నారు జనం దానితో జగన్ పట్ల వారి అభిమానం ఇబ్బడిముబ్బడి అవుతుంది.  రాబో‍యే ఎన్నికల్లో వైసిపి విజయాన్ని తక్కువ చేసి చూపుతున్న జగన్ వ్యతిరేఖవర్గ మీడియా,  జగన్ కు చెరుపు చేయబోతుందని విశాఖలోని టిడిపి వ్యక్తులే అంటున్నారు.



సభలకు వస్తున్న జనాలే దీనికి తార్కాణం అని విశాఖ జిల్లాకు చెందిన ఒక అనుభవఙ్జుడైన పాత్రికేయుడు వ్యాఖ్యానించారు. అలాగే విశాఖ జిల్లాలోని టిడిపి నాయకుల అవినీతి చేలియలి కట్టను దాటిందని వారి అక్రమాలకు వ్యతిరేకంగా వారికి చెక్ పెట్టటానికి ఉవ్విళ్ళూరుతున్న ప్రజలు జగన్ కు స్వాగత ద్వారాలు తెరుస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే ఏజన్సీ ప్రాంతంలో అధికార పార్టీకి వ్యతిరేఖంగా నిశ్శబ్ధ విప్లవాగ్ని రగులుతున్న దాఖలాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: