2014 లో పవన్ కళ్యాణ్ పోటీ చేయక పోవడం వెనుక అంత కథ ఉందా...!

Prathap Kaluva

2104 లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమి కి మద్దతు ఇచ్చిన సంగతీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ను ఏందుకు 2014 లో పోటీ చేయలేదని ఎవరైనా అడిగితే అతను చెప్పే సమాధానం ఒకటే. ఓట్లు చీలి పోతాయని, అయితే ఇప్పడూ తెలుస్తున్న సమాచారం ప్రకారం దానికి కారణం వేరే ఉందని అంటున్నారు. రాజ్య సభ సీటు ఆఫర్ చేశారని అందుకే పవన్ కళ్యాణ్ వెనుకకు తగ్గాడని తెలుస్తుంది. 


చెప్పింది స్వయానా పవన్‌కళ్యాణ్‌ కాబట్టి, ఇది నిజమేనని అనుకోవాల్సిందే. కానీ, ఆ రాజ్యసభ సీటు ఎవరి కోసమో తెలుసా.? బీజేపీ చెబుతున్న దాన్నిబట్టి.. అన్నయ్య చిరంజీవి కోసం పవన్‌కళ్యాణ్‌, ఆ రాజ్యసభ సీటుని కోరుకున్నారట. వినడానికే షాకింగ్‌గా వుంది కదా.! అయినాగానీ, ఇదే నిజమట. కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభ పదవి అందుకున్న చిరంజీవి, ఆ టెర్మ్‌ ముగిశాక, మళ్ళీ రాజ్యసభలో కొనసాగాలని అనుకున్నారనీ, తమ్ముడి ద్వారా అది నెరవేర్చుకోవాలని అనుకున్నారనీ.. బీజేపీ మాటల్ని బట్టి అర్థమవుతోంది.


చిరంజీవి కోరుకుంటే, కాంగ్రెస్‌ నుంచి ఎలాగోలా రాజ్యసభకు మళ్ళీ ఎంపికయ్యేవారేమో. పోనీ, డైరెక్ట్‌గా చంద్రబాబుని అడిగినా రాజ్యసభ సీటు దక్కే అవకశం లేకపోలేదు. అంతెందుకు, బీజేపీని సరాసరి చిరంజీవి ఆశ్రయించి వుంటే రాజ్యసభ సీటు దక్కకుండా వుంటుందా.? ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో చిరంజీవికి రాజ్యసభ ఛాన్స్‌ దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యల ద్వారా, బీజేపీ.. చిరంజీవిని ఇరకాటంలోకి లాగేసింది. కాదు కాదు, తన వ్యాఖ్యల ద్వారా చిరంజీవిని రాజకీయంగా ఇరకాటంలో పెట్టేశారు పవన్‌కళ్యాణ్‌?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: