టిడిపి అవిశ్వాసం పై రేపే పార్లమెంటులో చర్చ అంతా సస్పెన్స్

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టం అమలు చేయాలనే డిమాండ్‌ తో టీడీపీ  కేంద్రంపై ప్రతిపాదించిన అవిశ్వాసంపై  చర్చకు పార్లమెంట్ ఉభయ సభలు సిద్దమౌతున్నాయి. ఇతర సమస్యలపై కూడ కాంగ్రెస్‌ తో పాటు ఇతర పార్టీల అవిశ్వాస తీర్మానం నోటీసులను పరిగణనలోకి తీసుకొన్నట్టుగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు.  అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చజరగనుంది. ప్రశ్నోత్తరాలు రద్దుచేసి శుక్రవారం మొత్తం అవిశ్వాసం తీర్మానంపై చర్చించనున్నారు. బీఏసీ నిర్ణయించింది. స్పీకర్ కార్యాలయం అవిశ్వాస తీర్మానంపై చర్చా తేదీని విడుదల చేసింది. మరోవైపు, వచ్చే సోమవారం రాజ్యసభలో ఏపీ అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అవిశ్వాసం తీర్మానం నోటీసు పైన శుక్రవారం చర్చ జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ అన్నారు.


వైయస్సార్ పార్టీ సభ్యులు లేని సమయం చూసి అవిశ్వాసంపై చర్చకు ఓకే చెప్పారని విమర్శించారు. దీంతో బీజేపీ - వైసీపీ మధ్య కుట్ర రాజకీయాలు మరోసారి వెలుగు చూశాయని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు బీఏసీలో కూడా నిర్ణయం తీసుకున్నారని సుజనా చౌదరి అన్నారు. అవిశ్వాసంపై రాజ్యసభ లో కూడా చర్చ  జరుగుతుందని అన్నారు. ఎట్టకేలకు అవిశ్వాసంపై  చర్చకు రెఢీ అంటూ కేంద్రం సంకేతాలు ఇచ్చింది.  అయితే ఈ అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ ఉభయసభల్లో ఏం జరగనుంది, ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉందా?  ఎన్డీఏకు బలముందా? యూపీఏ బలమెంత? బలం లేకున్నా అవిశ్వాసం ప్రతిపాదించడంలో ఉద్దేశ్యం ఏమిటో? తెలుసుకొందాం.


ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది సభ్యులున్నారు. అయితే మోడీ సర్కార్ గట్టెక్కాలంటే  272 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏకు  314 మంది ఎంపీల బలం ఉంది. యూపీఏకు 66 సభ్యులు మాత్రమే ఉన్నారు.అయితే  ఎన్డీఏలో అసంతృప్తిగా ఉన్న పార్టీలను తమ వైపుకు తిప్పుకొంటే  విపక్షాల బలం పెరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే  ఈ విషయంలో విపక్షాలు ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. ఇదిలా ఉంటే నియమనిబంధనల ప్రకారంగా అవిశ్వాసం తీర్మానానికి సంబంధించి 10 రోజుల్లోపుగా  ఏ రోజున అవిశ్వాసంపై చర్చను చేపట్టనున్నారో స్పీకర్ ప్రకటించాలి. ఎంత సేపు ఈ అంశంపై చర్చ జరపాలని నిర్ణయం తీసుకొన్నారో కూడ ప్రకటించాల్సి ఉంటుంది.


ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై టీడీపీ చేస్తున్న పోరాటానికి అందరూ సహకరించాలన్నారు. లోకసభలో ఎల్లుండి (శుక్రవారం) అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగ నుంది. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చర్చ జరుగుతుంది. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి శుక్రవారం మొత్తం అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుపుతారు. టీడీపీ తీర్మానం పై చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది.


ఏపీకి ఏ మేరకు సహాయం చేశామో అంకెలతో సహ వివరించనున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇతరరాష్ట్రాల నుండి విపక్షాలు చేసేవిమర్శలకు సమాధానాలు చెప్పేందుకు  ఆ పార్టీ నేతలు సిద్దమయ్యారు. ఇదిలా ఉంటే అవిశ్వాసంపై చర్చ జరిగే సమయంలో వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో లేకపోవడం గమనార్హం. 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: