ఉత్తరాంధ్రలో పవన్ ప్రభావం బానే ఉంది..!

KSK
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర అంటూ ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి మనకందరికీ తెలిసినదే. ఇందులోభాగంగా మొదటిగా యాత్రను ఉత్తరాంధ్రలో మొదలుపెట్టారు పవన్. దీంతో పవన్ రాకతో అక్కడ ఉన్న ప్రజలలో ధైర్యం నమ్మకం కలిగాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సమస్యలపై పవన్కళ్యాణ్ ప్రసంగాలకు ఆ ప్రాంత ప్రజలు ఎంతో ముగ్ధులయ్యారు.


పవన్ ఎక్కడకు వెళ్లిన ఆ ప్రాంత సమస్యలే అవగాహనా చేసుకుని జనం తరపున ప్రభుత్వాన్ని చాలా గట్టిగా ప్రశ్నించడం మరో పక్క ప్రజలు కూడా అసంతృప్తి తో ఉండటం తో జగన్ మేనియా ఇటు వైపు ఇంకా పూర్తి గా సోకకపోవడం తో పవన్ మాటల్లో నిజాయితీ వీరుల నమ్మకాన్ని కలిగించింది. ఇదే విషయాన్నీ వివిధ పత్రికలు నిగ్గు తేల్చి చెప్పాయి. 2019 లో జనసేన దే ఆధిపత్యం అని నిరూపించాయి.


సామాన్యులలో జనసేన పై నమ్మకం పెరుగుతుండటం బలహీనమైన ప్రతిపక్షం తో పోల్చితే ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన పవన్ కళ్యాణ్ గారిలో స్పష్టం గా కనిపిస్తుంది. దీనిని బట్టి రానున్న ఎన్నికల్లో ప్రజలు 70 నుంచి 75 % పవన్ కు మద్దతు ఇవ్వొచ్చు అని పలువురి అభిప్రాయం.


అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్కళ్యాణ్ మీటింగ్లో ఎక్కువగా కనబడుతున్నది యూత్...మరోపక్క జగన్ సభలలో చిన్న పెద్ద ముసలి యువతీ యువకులు ప్రతి ఒక్కరు హాజరవుతున్నారు...మరి జగన్ రాకతో ఉత్తరాంధ్రలో సీన్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికయితే ఉత్తరాంధ్రలో పవన్ హవా కొనసాగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: