“చంద్రబాబు, జేడీ” ల భేటీ అందుకోసమేనా

Bhavannarayana Nch

రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా..?  చంద్రబాబు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ప్రజలని తనవైపు తిప్పుకుంటారు అని చెప్పే రాజకీయ విశ్లేషకుల మాటలు నిజం కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు  విశ్లేషకులు..అయితే పరిణామాలకి కారణం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చంద్రబాబు తో భేటీ కావాలని అనుకోవడమే..అయితే ఇప్పుడు ఈ భేటీ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పార్టీలని కంగారు పెట్టిస్తోంది..ఒక పక్క జేడీ ఉద్యోగానికి రాజీనామా చేసి రైతుల సమస్యలపై పోరాటం చేస్తానని ప్రకటించగానే అందరూ అడిగిన ప్రశ్న మీరు ఏ పార్టీలోకి వెళ్లనున్నారు..లేదా పార్టీ పెట్టనున్నారా అని అయితే

 

ఎంతో కాలం నుంచీ విలేఖరులు అడిగే ఈ ప్రశ్నకి సమాధానం దాటవేసే జేడీ తాజాగా ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి బదులుగా రైతుల సంక్షేమం పట్టించుకునే పార్టీలకే నా మద్దతు ఉంటుంది నా నిర్ణయం అప్పుడు ప్రకటిస్తా పార్టీ పెట్టె యోచన లేదు అంటూ ప్రకటన చేశారు అయితే ఈ వ్యాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే జేడీ చంద్రబాబు తో భేటీ అవ్వాలని అనుకోవడం ఎంతో ప్రాధాన్యతని సంతరించుకుంది అంతేకాదు..జేడీ చంద్రబాబుతో భేటీ అయ్యేది తెలుగుదేశం పార్టీలో చేరడానికే అంటూ వార్తలు కూడా పుట్టుకొచ్చాయి..

 

 

 కానీ జేడీ చంద్రబాబు ని కలవాలని అనుకోవడానికి అసలు రీజన్ వేరే ఉందని అంటున్నారు జేడీ వర్గీయులు జేడీ చంద్రబాబు దగ్గరకి వెళ్ళేది రైతుల సమస్యలని సీఎం కి విన్నవించడానికి తప్ప మరేమీ లేదని అయితే ఈ విషయంలో పెద్ద రాద్దాంతం చేయవద్దని అంటున్నారు..కానీ పై పై కి రైతుల సమస్యలు చెప్పడానికే అంటున్నా అసలు విషయం జేడీ టీడీపీ లో చేరడానికే అంటూ ఈ భేటీ అంటూ వార్తలు వస్తున్నాయి ఏది ఏమినా జేడీ బాబు తో భేటీ అయిన తరువాతే అసలు వివరాలు బయటకి వస్తాయి అంటున్నారు విశ్లేషకులు..అయితే జేడీ చంద్రబాబు పార్టీలోకి వెళ్ళాలి అంటే రైతు సమస్యలు ఏపీలో ఉన్నాయి అంటూ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అంటూ ప్రకటనలు ఎందుకు ఇస్తారు అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: