చంద్ర బాబు గురించి మోడీ అలా అన్నాడా..!

Prathap Kaluva

ఏపీ లో టీడీపీ చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు బీజేపీ కి ఇక ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టగతులు ఉండవన్న సంగతీ బీజేపీ పెద్దలకు తెలిసి పోయింది. ఇన్నాళ్లు బీజేపీ మరియు టీడీపీ ఒకే కూటమి లో  ఉండి ఒకరినొకరు పొగిడికొని పబ్బం గడుపుకున్నారు. అయితే ఇపుడు తెలుగు దేశం పార్టీ బయటికి వచ్చేసి బీజేపీ మీద విమర్శల జోరు కురిపిస్తోంది. అయితే ఇప్పడూ టీడీపీ బీజేపీ మీద పై చేయి సాధించింది అని చెప్పొచ్చు. 


తాజాగా, ఏపీ ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావుకీ, బీజేపీ సీనియర్‌ నేత జీవీఎల్‌ నరసింహారావుకీ మధ్య రాజకీయంగా చాలా రచ్చ జరుగుతోంది. ఇద్దరూ వ్యక్తిగత స్థాయికి వెళ్ళిపోయి ఒకర్ని ఒకరు విమర్శించుకుంటున్నారు. తమ స్థాయిని మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. 'సిగ్గూశరం లేదా.?' అంటూ తిట్టుకుంటున్నారు. కుటుంబరావు లెక్కలు ఒకలా వున్నాయి, జీవీఎల్‌ లెక్కలు ఇంకోలా వున్నాయి.


ఓ యాంగిల్‌లో చూస్తే, టీడీపీ చెబుతున్నవన్నీ నిజమేనా.. అన్న అనుమానం కలగక మానదు. ఆ స్థాయిలో విషయాన్ని పూసగుచ్చేస్తున్నారు కుటుంబరావు. కొన్నిసార్లు జీవీఎల్‌ ఎదురుదాడికే పరిమితమవుతున్నారు. పోలవరం ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించడంలో అయినా, ప్రత్యేకహోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ కోసం చంద్రబాబు పాకులాడటంలో అయినా ఓ ఖచ్చితమైన వ్యూహం వుందనే విషయం స్పష్టమవుతోంది. అంతలా చంద్రబాబు 'స్కెచ్‌' వేసేశారు. అందుకేనేమో, నరేంద్రమోడీ 'చంద్రబాబు ఇంతలా మనల్ని మోసం చేస్తారనుకోలేదు..' అని బీజేపీ ఏపీ నేతల వద్ద వ్యాఖ్యానించాల్సి వచ్చిందట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: