జగన్, చంద్ర బాబు నాయుడు హామీలు ఇస్తున్నారు... మరీ పవన్ ఎందుకు ఇవ్వడం లేదు..!

Prathap Kaluva

 పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి నాలుగేళ్లు దాటి పోతుంది. 2019  లో ఎన్నికలు కూడా వస్తున్నాయి. అయితే ఒక పక్క టీడీపీ మరియు వైసీపీ పార్టీ లు ప్రజల మీద వరాల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఇంత వరకు జనసేన మ్యానిఫెస్ట్ బయటికి రాలేదు. పవన్ కళ్యాణ్ తానూ అధికారం లోకి వస్తే ఏం చేస్తానో చెప్పడం లేదు. దీనికి అంతటికి కారణం పవన్ కళ్యాణ్ కు క్లారిటీ, అవగాహన లేకపోవడం. గతంలో అనంతపురం సభలో తాము ఎన్ని సీట్లకు పోటీచేసేది తర్వాత చెబుతామని, మొత్తం రాష్ట్రం అంతా పోటీచేసే బలంలేదని అన్నారు.


ఆ తర్వాత శ్రీకాకుళం సభలో మొత్తం 175 సీట్లకు పోటీచేస్తామని ప్రకటించారు. తదుపరి సీపీఐ కార్యదర్శి రామకృష్ణతో చర్చలు జరిపి, వామపక్షాలతో కలిసి వెళ్తామని అన్నారు. అంటే వారితో పొత్తు పెట్టుకోవలసిన పరిస్థితి ఉంటుంది. మరి ఆ విషయం అయినా స్పష్టంగా చెబుతున్నారా అంటే అదీలేదు. పోరాటయాత్రను ఉత్తరాంద్రలో ఆరంభించి కొంత హడావుడి చేశారు. అలాగే మేధావుల సమావేశం పెట్టారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటు తనం గురించి, ప్రత్యేక తెలంగాణ తరహా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు.


తన యాత్రల ద్వారా యువతను కొంతమేర ఆకర్షించగలుగుతున్నారు. కాని ఆయన వ్యక్తిగత సమస్యవల్లనో, లేక మరే కారణమో తెలియదు కాని ఒకపద్ధతి ప్రకారం, ఒక షెడ్యూల్‌ ప్రకారం ఎఫెక్టివ్‌గా సాగించలేకపోతున్నారు. రంజాన్‌ పేరుతో అన్నిరోజులు విరామం తీసుకోవడం కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. అలాంటప్పుడు ముందే ఏకంగా నలభైఐదు రోజులు పోరాటయాత్ర సాగుతుందని చెప్పి ఉండాల్సింది కాదు. మధ్యలో రిసార్టులో బసచేయడం తదితర చర్యలవల్ల పార్టీ ఇమేజీ దెబ్బతింటుంది.  ఇలా ప్రతి విషయం లో క్లారిటీ లేకపోవడం వల్ల ఈ పార్టీ ఏ మేరా ప్రభావం చూపిస్తుందో అర్ధం కావడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: