చంద్రబాబుపై జగన్ చెప్పిన కథకి పడిపడి నవ్వుతున్న ప్రజలు.

KSK
వైసీపీ అధినేత ప్రతిపక్షనేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వాసులు జగన్ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో జరిగిన ప్రతి జగన్ సభకు ప్రజలు తండోపతండాలుగా వస్తూ జగన్ చెబుతున్న మాటలు ఆసక్తిగా వింటున్నారు...అంతేకాకుండా చంద్రబాబు చేసిన మోసాలను జగన్ కి వినవించుకుంటున్నారు సామాన్య ప్రజలు.

తాజాగా ఇటీవల జగన్ తలపెట్టిన రాజోలు సభలో చంద్రబాబుపై ఆయన చేస్తున్న మోసాలపై సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇంకా చాలా వివరించిన జగన్ విధానం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంతకీ జగన్ రాజోలులో చంద్రబాబుపై చెప్పిన కథ ఏమిటంటే అనగనగా ఒక తుంటరి విద్యార్థి ఉన్నాడు... ఈ చంద్రబాబు మాదిరి. ఆ విద్యార్థి వార్షిక పరీక్షలు రాయడానికి వెళ్లాడు.

మూడు గంటల పరీక్షలో రెండున్నర గంటలు ఏమీ రాయకుండా కూర్చున్నాడు. తీరా పరీక్ష సమయం దగ్గరపడుతుందనగా, మాస్టారు దగ్గరికొచ్చి.. ‘సార్‌.. నాకు ఇంకో మూడు గంటలు టైమివ్వండి పరీక్ష రాస్తాను’ అన్నాడు.

విద్యార్థి తీరుకు విస్తుపోయిన మాస్టారు.. ‘మరి ఇంతసేపు ఏం చేశావయ్యా!’ అని నిలదీస్తాడు. అప్పుడా విద్యార్థి.. ‘సార్‌, మీరు నెల టైమిస్తే స్టేట్‌ ఫస్ట్‌ వస్తా, ఐదు నెలలు టైమిస్తే ప్రపంచంలోనే ఫస్టొస్తా..’ అని చెబుతాడు.. 2020 కల్లా దేశంలో, 2050 కల్లా ప్రపంచంలో ఏపీని నంబర్‌ వన్‌ చేస్తానంటున్న చంద్రబాబు ఈ కథలోని విద్యార్థి అయితే, మాస్టారుగా ఆయన్ని నిలదీసేది ప్రజలు. మొత్తంమీద జగన్ చంద్రబాబు ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు కథల రూపంలో బాగా చెబుతున్నారు అని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: