ఢిల్లీలో రాజ్యాంగ సంక్షోభం ఎమర్జెన్సీ పరిస్థితి?

గత నాలుగు నెలలుగా దేశ రాజధాని డిల్లీలో పాలనా వ్యవస్థ కుంటుబడింది. ప్రభుత్వ అధికారులు, ముఖ్యమంత్రి తో కలిపి ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల మద్య ఐఖ్యత శూన్యమైంది. తొలి నుండీ ప్రజా ప్రయోజనాలని ప్రక్కనబెట్టి ఆ కేంద్రపాలిత, పాక్షిక రాష్ట్ర ముఖ్యమంత్రి అటు లెఫ్టినెంట్ గవర్నర్ తోను ఇటు కేంద్ర ప్రభుత్వంతోను గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ప్రజలకు నిష్ప్రయోజనమైన రాజకీయ విన్యాసాలు చేయటం చూస్తూనే ఉన్నాం.    

అందువలన దేశ రాజధాని ఢిల్లీలో అతవసర పరిస్థితి వంటి వాతావరణం అలుముకుందని, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కలుగజేసుకోవాలని "ఆమ్ ఆద్మీ పార్టీ-ఆప్" బుధవారం డిమాండ్ చేసింది. ఢిల్లీ, పంజాబ్ శాసనసభ్యులతో పాటు తాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అపాయింట్‌మెంట్‌ను కోరినట్లు రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ చెప్పారు. 

"గత నాలుగు నెలలుగా ఐఎఎస్ అధికారులు సమ్మె చేస్తుండడం" వల్ల ఢిల్లీ ప్రభుత్వ విధి నిర్వహణ పూర్తిగా కుంటుపడిందని, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే 'లెఫ్టినెంట్ గవర్నర్' అనిల్ బైజల్  నడుచుకుంటున్నారని ఆరోపణలతో విమర్శించారు.  తమ డిమాండ్లు నెరవేర్చుకోడానికి, ఒత్తిడి తేడానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన కేబినెట్ సహచరులు లెఫ్టినెంట్-గవర్నర్ కార్యాలయంవద్ద నిరాహారదీక్షకు కూర్చున్నాక సంజయ్ సింగ్ పై వ్యాఖ్యలు చేశారు. 

ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో మాట్లాడేందుకు మూడు రోజులుగా మూడు నిమిషాల సమయమైనా లెఫ్టినెంట్ గవర్నర్ కేటాయించలేక పోతున్నారన్నారు. తాను సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, జనతా దళ్(ఎస్), సిపిఎం, సిపిఐ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ నాయకులతో మాట్లాడానని, వారంతా మద్దతు ఇస్తామని అన్నారని సంజయ్ సింగ్ చెప్పారు.  రాష్ట్రపతి కలుగ జేసుకోవాలి. లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రప్రభుత్వం కలసి ఈ సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన కోరారు. ప్రస్తుత సమస్యకు పరిష్కారం కుదరకుంటే 'ఆప్' పెద్ద ఎత్తున ఉదమిస్తుందని కూడా హెచ్చరించారు.

అసలు ప్రభుత్వమే లేని శూన్య అగమ్య గోచరమైన పరిస్థితి నెలకొందని డిల్లీ గురించి తెలిసినవారు అంటున్నారు. అంతేకాదు సమస్యా పరిష్కారానికి సున్నిత  ప్రవర్తన అవసరమని అది లేశమాత్రమైనా అరవింద్ కేజ్రివాల్ లో కనిపించదని. దీల్లీని, దానికి ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్ధానాలను నేరవేర్చటానికి కేంద్రం తో కొంత సమన్వయం అవసరమని, ఉద్యమాలతో సాధించేది ఏమీలేదని కొంత లౌక్యంప్రదర్శించటం అవసరమని డిల్లీవాసులు ముఖ్యమంత్రి పై విమర్శ లు గుప్పిస్తున్నారు. తమ రాష్ట్ర పరిస్థితులను సరిదిద్దటానికి పొరుగు రాష్ట్రాల నాయకుల మద్దతు ఎందుకని విఙ్జులైన డెలైట్స్ పదేపదే కేజ్రివాల్ లోని అహంకారాన్ని, అసమర్ధతను ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: