చంద్రబాబు కి సుకుమార్ సినిమాలో కంటే పెద్ద ట్విస్ట్ ఇచ్చిన జగన్

KSK
వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ముగించుకుని తూర్పుగోదావరి జిల్లాలో అడుగు పెట్టిన నేపథ్యంలో అధినేత జగన్ కి తూర్పుగోదావరి ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలికారు. జగన్ రాకతో తూర్పుగోదావరి జిల్లా మొత్తం పులకించిపోయింది. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో పాదయాత్ర ముగించుకున్న జగన్ కి ఆయా జిల్లాల ప్రజలు ఎంతగానో ఆదరించారు. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టిన జగన్ అధికార పార్టీ తెలుగుదేశం నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు.


జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ప్రజా సంక‌ల్ప యాత్ర పూర్తి చేసుకున్న ప్రాంతాల్లో ప‌లు చోట్ల త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున పోటీ చేయించేందుకు అభ్యర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఇప్పుడు అదే ఫార్ములాను తూర్పు గోదావ‌రి జిల్లాలోనూ వైఎస్ జ‌గ‌న్ పాటించ‌నున్నారు. గత ఎన్నికలలో తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాల్లో వైసీపీ కేవ‌లం ఐదు స్థానాల్లో గెలుపొందింది. అందులోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు చూపిన డ‌బ్బు మూట‌ల‌కు అమ్ముడు పోగా.. మిగిలిన ఇద్ద‌రు ప్ర‌జ‌లు న‌మ్మిన జ‌గ‌న్ వెంట ఉన్నారు.


అస‌లే రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌బాబు స‌ర్కార్ పాలన‌పై వ్య‌తిరేక‌త నెలకొన్న నేప‌థ్యంలో.. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా ప్ర‌భావం చూపనుంది. చంద్ర‌బాబు పాల‌న‌ను ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారు. మరియు అదే విధంగా ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర పేరిట ఆయా నియోజకవర్గాలలో దూసుకుపోతున్నారు...ఎన్నికలకు ఏడాది ముందుగానే జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కి ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబుపై ఆయన చేసిన అవినీతిపై ప్రజలను తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో జగన్ క్లారిటీ గా అభ్యర్థులను ప్రకటించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు.

తాజాగా జగన్ అనుసరిస్తున్నా ఫార్ములాకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అలాగే తెలుగుదేశం నాయకులు కూడా బెదిరిపోతున్నారు. మొత్తంమీద జగన్ తన ప్రజా సంకల్ప పాదయాత్ర తో రాష్ట్ర అధికార పార్టీ నేతలకు నిద్రలేకుండా మరోపక్క వచ్చేఎన్నికలలో అధికారపార్టీకి అభ్యర్థులను కూడా దొరకనివ్వకుండా రాజకీయాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు... ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీ డైరెక్టర్ సుకుమార్ ఆడియన్స్ కి ట్విస్ట్ లు ఇచ్చినట్లు జగన్ తెలుగుదేశం నేతలకు షాక్ మీద షాక్ లు ఇస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: