ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధాని వాజ్‌పేయి!

Edari Rama Krishna
కాగా, సుమారు మూడు దశాబ్దాలుగా వాజ్ పేయికి పర్సనల్ ఫిజీషియన్ గా రణ్ దీప్ వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 94 సంవత్సరాల వాజ్ పేయి మంచానికే పరిమితమయ్యారు.   బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాని వాజ్ పేయిని అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్‌ చేసింది.  అయితే రెగ్యులర్‌ చెకప్‌ కోసమే ఆయన్ని ఎయిమ్స్‌కు తరలించినట్లు ఆయన కార్యదర్శి మహేంద్ర పాండే ఓ ప్రెస్‌ నోట్‌ మీడియాకు విడుదల చేశారు.

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా నేతృత్వంలోని బృందం వాజ్‌పేయికి చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.కాగా, సుమారు మూడు దశాబ్దాలుగా వాజ్ పేయికి పర్సనల్ ఫిజీషియన్ గా రణ్ దీప్ వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 94 సంవత్సరాల వాజ్ పేయి మంచానికే పరిమితమయ్యారు.  గతంలో వాజ్‌పేయి గురించి కొన్ని ఫేక్‌ న్యూస్‌లు వైరల్‌ కాగా, కొన్ని మీడియా ఛానెళ్లు ఇప్పుడు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి బ్రేకింగ్‌లు ఇవ్వటం గమనార్హం. రాజకీయ దురంధరుడిగా పేరు తెచ్చుకున్న వాజ్ పేయి 1924లో జన్మించారు.

1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.  నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటేరియన్‌గా ఉన్న వాజ్‌పేయి.. భారత దేశానికి పదో ప్రధానిగా పనిచేశారు. కాంగ్రెసేతర ప్రధానిగా దేశాన్ని ఐదేళ్లు పాలించిన ఘనత కూడా వాజ్‌పేయిదే.  వివాదరహితుడిగా ప్రతిపక్ష పార్టీలతోపాటు పలువురి ప్రశంసలు ఆయన అందుకున్నారు. బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్‌ మీడియాలో పలువురు సందేశాలు పెడుతున్నారు. 
Former PM AB Vajpayee admitted in AIIMS. @ThePrintIndia pic.twitter.com/mSzVh0z0wt

— Pragya Kaushika (@pragyakaushika) June 11, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: