వీకెండ్ స్పెషల్: నరెంద్ర మోడీతో "ఢీ" కొట్టి పోరాటం సాగించటం చంద్రబాబుకి సాధ్యమేనా!

ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 25. వీటన్నింటిలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే, 2019ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వానికి సంబంధించి ప్రధాని పదవికి అర్హుణ్ణి తామే నిర్ణయించగల స్థాయిలో ఉంటామని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఘంటాపథంగా చెబుతున్నారు.


జాతీయ స్థాయిలో ఆయన చక్రం తిప్పి, చక్రం బాబు అని అనిపించుకున్న అనుభవం గతంలో నారా చంద్రబాబు నాయుడుకి వున్న మాట నిజం.  అయితే, అది రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ బలంగా వున్నప్పటి పరిస్థితి.


ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్లైన్ది. జాతీయ రాజకీయాల్లోనే కాదు రాష్ట్రం చంద్రబాబు 'ప్రభ' వెలవెల పోవటం వాస్తవం. కానీ, ఇప్పటికీ చంద్రబాబు తన గత కలం నాటి చితికి పోయిన శిధిల ఙ్జాపకాలనే పదే పదే గొప్పగా నాటి 'గొప్పల్నే' చెప్పు కుంటూ, రాజకీయంగా తన ఉనికిని చాటుకునేందుకు తెవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలనీ 2019ఎన్నికల వరకే. తర్వాత పరిస్థితులు ఎలా మారిపోతాయనేది చెప్పలేం. రాష్ట్రంలో ఇప్పటికే చంద్రబాబుకి, ఆయన ప్రభుత్వం, మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పట్ల  వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.


ప్రత్యేకించి అధినేతను ఎవరైనా విమర్శిస్తే మొత్తం 'అధికార పార్టీ మిడతల దండు' అంతా వారికోసమే పుట్టి వారికి మద్దతు ఇచ్చే అధిక సంఖ్యలో ఉన్న చానళ్ళలో తిష్ఠ వేసి ఆ విమర్శించిన వ్యక్తిపై మూకుమ్మడి దాడి చేయటం ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అంతేకాదు ప్రభుత్వ వ్యతిరెఖతను కనీసం క్షమించలేక పోవటం టిడిపి నాయకత్వానికి అసహనంగా మారిపోయింది.


ఆ దుర్ఘంధ పూరిత ఆలోచనలో  నుంచే శాసనసభలో విపక్షం ప్రవేసించ నివ్వని పరిస్థితులను కలిపించారు చంద్రబాబు. విపక్ష ఎమెల్యేలని పశువులను కొన్నట్లు కొని, వారిచేతే విపక్షనేతను ధారుణంగా అవమానించటాన్ని పార్టీ రహితంగా ప్రజలు విమర్శిస్తున్నారు. దాంతో చంద్రబాబు ప్రభుత్వంపై "యాంటి ఇంకంబెన్సి" విపరీతంగా గత రెండు నెలల్లోనే పెరిగిపోయింది. అదే ఇప్పుడు టిడిపి అంటేనే అసహ్యం అసహనం రూపంలో వ్యక్తమౌతుంది. దీనికి తోడు రాజకీయ క్రెడిబిలిటీ లేని లోకెష్ మాటల లో ఉపన్యాసాలలో ద్వనించే అహంభావం, అహంకారం - చంద్రబాబు ఉపన్యాసాలలో బయటపడే ఏమీ చేయలేని నిస్సహాయత, నిర్లిప్తత, నిస్తేజం ఇదంతా టిడిపి ప్రభుత్వంపై ప్రజలకు గౌరవ ప్రతిష్ఠలు రోజు రోజుకు పెద్ద శాతంలోనే పడిపోవటం చంద్రబాబు గమనించట్లేదనిపిస్తుంది. ఒకవేళ గమనించినా 2019లో తన ప్రభుత్వం అధికారంలోకి రాదని నిశ్చయమై కనీసం తన, తనవాళ్ళ, తన మీడియా చానళ్ల స్వార్ధ ప్రయోజనాలైనా కాపాడుదామని అనుకొని ఉండొచ్చు.   


ఈ పరిస్థితుల్లో ఇంకా చంద్రబాబు నాయుడు, తాను ప్రధాని నరేంద్ర మోడీని 'ఢీ' కొంటానంటూ చేస్తున్న ప్రకటనలహోరు పట్ల ప్రజల దృక్పధం రివర్సై మోడీకి అను కూలం మారుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఆయనలో అలుముకుంటున్న నిరాశను దాచు కోలేక మేకపోతు గాంభీర్యంగానే బయట పడుతున్నట్లు పరి గణించాల్సి వుంటుంది. చంద్రబాబుకి అతి విశ్వాసపాత్రుడు అదే సామాజిక వర్గానికి చెందిన అంతెవాసి అయిన ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకురి కుటుంబరావు అంచనా మేరకు 2019ఎన్నికల్లో జాతీయ స్థాయి లో ‘బీజేపీనే సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీ’  మాత్రమె అని 'రాసిపెట్టుకోండి' అంటూ  గట్టిగా బల్ల గుద్ది చెబుతు న్నారంటే, బీజేపీ బలం పట్ల ఆయన కెంత 'గట్టి నమ్మకం' వుందో అర్థం చేసుకోవచ్చు.


కాంగ్రెస్‌ ఎలాగూ బీజేపీని అధిగమించి సీట్లు సంపాదించే అవకాశం లేదనే విషయం స్పష్టమవుతోంది. కాంగ్రెస్ కాకుండా, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కట్టగట్టుకున్నా, “మ్యాజిక్‌ ఫిగర్” ని అందుకోవడం అసంభవం అంటున్నరు. ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత, ఎన్నికలకు ముందు చెప్పినట్లుండదు. ఈ విషయం అందరికన్నా బాగా చంద్రబాబు నాయునికే తెలుసు. ఉదాహరణకు నేటి కర్ణాటక కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణం చూస్తేనే తెలుస్తుంది. పదవులకోసం ప్రతిపక్షాల ఐఖ్యత బజార్లో కుక్కల కొట్లాట లాగా ఉంటుంది. ప్రభుత్వం మీద కాంగ్రెస్ మంత్రులు తిరుగుబాటు చేశారని ముఖ్యమంత్రి కుమారస్వామే చెప్పారంటే ప్రాంతీయ పార్టీల తీరు జాతీయ పార్టి కాంగ్రేస్ ప్రాంతీయ పార్టీ స్థాయికి కుంచించుకు పోయిన తీరు వీటి ఐఖ్యత గురించి చెపుతునే ఉంది. 


ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్రమోడీని గాని, బీజేపీని గాని ఈ చంద్రబాబు ఎలా ఎదుర్కోగలరు? చంద్రబాబు ఆలోచన ఒక్కటే, బీజేపీని ఎదుర్కోవడం సంగతి తర్వాత, ముందంటూ, తాను రాజకీయంగా ఇబ్బంది పడకూడదన్న కోణంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని, తనకు రక్షణ కవచంలా మార్చుకోవాలని అనుకుంటున్నారు. ఇదంతా ఆయన అంతరంగంలో నెలకొన్న నిరాశ నుండి ఉద్భవించినవే. 


కారణం ప్రభుత్వంలోని ముఖ్యంగా మంత్రులు, ఎమెల్యెలు, ప్రజాప్రతినిధులు, ఒక వర్గాన్ని నేధ్యంలో ఉండి సమర్ధిస్తున్న ఉన్నతాధికారవర్గం అవినీతి, భూకబ్జాలు, ప్రకృతిని దోపిడీ చేసే మాఫియా గ్రూపులపై ప్రస్తుతం అధికారం చలాయిస్తున్న టిడిపి పంచమాంగ దళం, ధారుణంగా ప్రకటనల రూపంలో పచ్చ మీడియాకు కోట్లాది రూపాయలు ప్రకటన రూపంలో దోచ్పెట్టిన తీరు గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వమే రోడ్డున పడి దీక్షలు చేయటం రాజ్యాంగవిరుద్ధం అంటున్నారు. ప్రజాధనం పార్టీ ప్రయోజనాలకు వాడేసే నికృష్ఠ వాతావరణం పై ప్రజల డేగకన్ను పడింది. సందర్భం రాగానే వేటు వేయటానికి వారు సిద్ధంగా ఉన్నరని నిరీక్షిస్తున్నారని కొన్ని సమాచారసేకరణల ద్వారా తెలుస్తుంది.


“నేను మోసపోయాను, అందరిలాగానే, నన్ను అంతమొందించాలని అనుకుంటున్నారు. నా మీద కక్ష సాధింపు చర్చలకు దిగుతున్నారు” అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు ఆయనలోని నేరాలు చేసిన వాళ్ళలో సహజంగా  ప్రభలే భయం నుండి ఉద్భవించిన  జలధరింపుగా కనిపిస్తున్నాయి ప్రజలకు, క్రింది స్థాయి కార్యకర్తలకు.


తనే విభజించి పాలించిన కులాలన్నీ మేల్కొంటున్నాయి. ఒక కులం వారితో వారి కులం వారినే తిట్టించిన తీరుతో కులాల్లో చంద్రబాబు కులం పట్ల పెరిగిపోతున్న ఏహ్యభావం కూడా చంద్రబాబుకు చావుదెబ్బే. అమరావతి ఒక కుల రాజధాని కాని, ప్రజల రాజధాని కాదనే భావన ప్రజల హృదయాల్లో నిండి ఉంది. అమరావతి నిర్మాణం పేరుతో వేల కోట్లు ఖర్చుచేసి ఇప్పటికి కూడా నగర ఆకృతులు కూడా ఫైనలైజ్ కాకపోవటం ప్రశ్నార్ధకం మాత్రమే కాదు, విపరీత ధన దుర్వినియోగంపై చర్చలు రేగుతున్నాయి.

చంద్రబాబు నాయుడు ఆయన తోడు ఆయన "వన్ మాన్ ఆర్మీ లోకేష్ వన్ మాన్ ఆర్మీ" అని ఎందుకన్నా మంటే ఈ మద్య టిడిపి నుంచి వలసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బాబుకు మిగిలేది "హళ్ళీకి హళ్ళి- సున్నకు సున్న" లోకేష్ మాత్రమే 


ఇక నిజమెంతో తెలియదు గాని సింగపూరు ప్రభుత్వంతో ముఖ్యంగా మంత్రి ఈశ్వరన్ సాయంతో చంద్రబాబు కుమ్మక్కై చేస్తున్న తప్పుడు నిర్వాకాలు అగ్రిమెంట్లు  అసలు అమరావతి నిర్మాణాన్నే "అంతర్జాతీయ లిటిగేషన్" లోకి నెట్టేయవచ్చని ఇప్పటికే విశ్లేషకులలోనే కాదు ప్రజల హృదయాల్లో కూడా ఆందోళనలు చెలరేగుతున్నాయి.


నరెంద్ర మోడీ అంటేనే వణికిపోవటం మనం రోజూ చూస్తూనే ఉన్నాం కదా! పాతిక సీట్ల కోసం తన సంరక్షణ కోసం ఇంతగా ఇదై తత్తరబిత్తర పడ్తున్న చంద్రబాబెక్కడ? 2019ఎన్నికల్లో తక్కువలోతక్కువ హీన స్థితిలో నైనా కూడా కనీసం 160సీట్లు గెలుచు కోగల సామర్ధ్యం కలిగి ఉన్ననరేంద్రమోడీ ఎక్కడ? అంటూ ఆయన మాట్లాడి వెళ్ళిన ప్రతి చోటా ప్రజలు చెప్పుతున్న మాటలు. ఇదంతా చూస్తుంటే అధికారాంతమందు చూడవలెన్ ....అయ్యవారు....దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునే పనిలో పడ్దారా? లేకపొతే 60-70యేళ్ళలో ఈ దేశం లక్ష కోట్ల రూపాయిల ఋణం తెస్తే నాలుగేళ్లలోనే దానికి ఒక లక్షా అరవై వేల కోట్ల కొత్త ఋణం జత కలవటం మన రాష్ట్ర ఆర్ధిక దుస్థితికి అద్దం పడుతుంది. 


దీనికి తోడు అత్యంత బలవంతమైన పార్టీగా రూపుదిద్దుకున్న వైసిపి - ఎమెల్యేలను టిడిపి కుటిల రాజకీయాలకు బలిచేసు కున్నందున - కావలసినంత ప్రజల నుండి సానుభూతిని - అయ్యో పాపం! అనే భావనను  మూటగట్తుకున్న దాని అధినేత జగన్మోహన రెడ్డిని - ఇప్పుడు గెలవటం అంత సులభం కాదు.


ఇక మరో ప్రక్క దూసుకుని చండప్రచండుడిలా వస్తున్నసినీ నటుడు, జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ ను ఎదుర్కోవటం అంత తేలిక అనిపించటం లేదు. అంతేకాదు తాజాగా కమ్యూనిస్టులతో సహా అందరికి అంటరాని పార్టీగా మారింది తెలుగుదేశం పార్టీ. ఎలాంటి పొత్తులేకుండా గెలవటం తెలుగుదేశం పార్టీ చరిత్రలో జరగలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: