‘హగ్ ఏ ట్రీ’గల్లా సరికొత్త ఛాలెంజ్!

Edari Rama Krishna
ఈ మద్య సోషల్ మీడియాలో ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ పేరిట కొత్త విధానానికి కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.  గతంలో ఇలాంటి ఛాలెంజ్ ప్రోగ్రామ్ ఎన్నో వచ్చాయి..అయితే రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ని కూడా ఎంతో మంది సెలబ్రెటీలు స్వీకరించడం..వారు మరొకరికి చాలెంజ్ చేయడం లాంటిది జరిగింది. 

తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా సరికొత్త ఛాలెంజ్ కు నాంది పలికారు. మన జీవితంలో పర్యావరణం, చెట్లు పోషిస్తున్న పాత్రను తెలియజెప్పే నిమిత్తం ‘హగ్ ఏ ట్రీ’ పేరిట కొత్త ఛాలెంజ్ కు ఆయన శ్రీకారం చుట్టారు.  ప్రపంచ పర్యావరణానికి చెట్లు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాయని..పచ్చదనం ఉంటే..స్వచ్చమైన గాలి వస్తుందని..దాని వల్ల మంచి ఆరోగ్యం సమకూరుతుందని ఆయన  ఒక చెట్టును జయదేవ్ ఆప్యాయంగా హగ్ చేసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అశోక్ గల్లా, సిద్ గల్లా, సుధీర్ బాబు, హీరోలు సుమంత్, రానా దగ్గుబాటికి ఆయన ఛాలెంజ్ విసిరారు.  


గల్లా జయదేవ్ కి హీరో సుమంత్ రిప్లై :
‘హగ్ ఏ ట్రీ’ పేరిట టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విసిరిన ఛాలెంజ్ కు హీరో సుమంత్ స్పందించారు. ఈ ఛాలెంజ్ కు అంగీకరిస్తున్నానని చెబుతూ, ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని, నాగచైతన్య అక్కినేని, సమంతా, సుశాంత్, కృతీ ఖర్బందాకు సుమంత్ ‘హగ్ ఏ ట్రీ’ ఛాలెంజ్ విసిరారు. సుమంతో ఇంట్లో చెట్టును హగ్ చేసుకున్న ఫోటో పోస్ట్ చేశారు..ఆయనతో పాటు ఓ పెంపుడు శునకం కూడా అదే చెట్టుపై తన రెండు కాళ్లు పెట్టి నిలబడింది.తన ఛాలెంజ్ కు స్పందించినందుకు, ఈ ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్తున్నందుకు సుమంత్ కు గల్లా జయదేవ్ కృతఙ్ఞతలు చెప్పారు.
Let's celebrate the role trees play in our life by giving them a warm hug!

I nominate @AshokGalla_ @sidgalla @isudheerbabu @iSumanth @RanaDaggubati to take the #HugATree challenge by posting a picture of you hugging a tree and nominating 5 friends to take up the challenge! pic.twitter.com/CscA1ds5PD

— Jay Galla (@JayGalla) June 7, 2018 #HugATree it’s their planet we’re living on!! pic.twitter.com/Ot0phQJEmx

— Rana Daggubati (@RanaDaggubati) June 7, 2018 Thanks for taking up this challenege @iSumanth and spreading love for trees. #HugATree https://t.co/iRGy5Co86l

— Jay Galla (@JayGalla) June 7, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: