చంద్రబాబు ప్రభుత్వం అంటే రెండే రెండు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!

KSK
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రజాపోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లాలో జనసేన కార్యకర్తలు మరి పవన్ అభిమానుల మధ్య సాగుతోంది. ఈ యాత్రలో జగన్ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి తప్పు చేశానని చాలా సందర్భాలలో ఈ యాత్రలో పాల్గొన్న సమయంలో పవన్ ప్రజలకు తెలియజేశారు. ఇటీవల ఉద్దానం కిడ్నీ సమస్యలపై పవన్ కళ్యాణ్ ఒక రోజు దీక్ష చేసిన విషయం మనకందరికీ తెలుసు.


ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ప్రత్యేక హోదా అంశంపై స్పందించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చేసే అభివృద్ధి ఇదేనా. ఆయన 40 ఏళ్ల అనుభవం కేవలం ఇసుక దోపిడీకి మాత్రమే ఉపయోగపడింది. ఒక్కో ఎమ్మెల్యే ఇసుక మాఫియా ద్వారా 30 కోట్లు కూడబెట్టారు. ఈ మాఫియా మొత్తాన్ని చంద్రబాబు పైనుంచి నడిపించారు."  


తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం, పాలకొండ మండల కేంద్రాల్లో పోరాట యాత్ర చేసిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ప్రభుత్వంపై దేవర అవినీతి ఆరోపణలు చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు టీడీపీ గురించి రెండే మాటలు వినిపిస్తున్నాయని, అవి భూకబ్జా, ఇసుక మాఫియా అని చెప్పుకొచ్చారు పవన్. ఇంతటి దారుణం గా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు వచ్చే ఎన్నికలలో మట్టి కొట్టుకుపోతారని అన్నారు పవన్.


అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో నేను ముఖ్యమంత్రి అయితే ముందుగా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడతానని హామీ ఇచ్చారు పవన్. ఈ క్రమంలో ప్రశ్నిస్తాడు అనీ వచ్చిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని అవ్వుతన్ను అధికారంలోకి వస్తాను అన్న మాటలకు అక్కడ ఉన్న కొంతమంది జనసేన కార్యకర్తలు ప్రజలు కంగుతిన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: