కర్ణాటక సీఎంగా కుమారస్వామి, ముహూర్తం ఖరారు: కాబినెట్ పై లీకులు?

బిజెపి ముఖ్యమంత్రి మూణ్ణాళ్ళ ముచ్చట తరవాత రాజీనామా చేశారు. ఒక అనుభవఙ్జుడైన కాంగ్రెస్ రాజకీయ నాయకుని ప్రయివేట్ మాటల ప్రకారం "సింహం పదడుగులు వెనక్కి వేసిందంటే ఓడిపోయిందను కోవటం బుద్దిమాంద్యులు చెసేపని, బహుశ అది రానున్న కాలములో లఘించి బలంగా శత్రువులపై దూకి అంతం చేయటానికేనన్నది కనీసం మనసులో పెట్టుకోవాలనే ఒక నానుడి. రాజకీయ సమరాంగణంలో ఒక అడుగు వెనక్కు వేసిన తరుణం - మరో వందడుగులు దూసుకు వెళ్ళటానికే అన్నది గుర్తించాలి. అదీ నరెంద్ర మోదీ-అమిత్ షాలైతే ఇంకా చెప్పేపనిలేదు" అని అంటున్నారు. 


కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులకే మెజారిటీ శాసనసభ్యల మద్దతు లేదని సీఎం పదవికి రాజీనామా చేశారు బీఎస్ యడ్యూరప్ప. అయితే గవర్నర్ పిలుపు మేరకు కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి రేపు సోమవారం (21.05.2018) ముహూర్తం ఫిక్స్ అయింది. అందుకే వారిప్పు డు సంబరాలు చేసుకుంటున్నారు. 

కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తిరుగుబాటు దారులకు చుక్కలు చూపించటానికి రంగం సిద్దం చేశారని తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటులో వైఫల్యం చెంది ప్రశాంతత పొందింది బిజేపి. అయితే కర్ణాటకలో మంత్రివర్గం ఏర్పాటు చెయ్యడం కాంగ్రెస్-జేడీఎస్ లకు పెద్ద తలనొప్పి మొదలైనట్లే. ఇప్పటికే కాంగ్రెస్-జేడీఎస్ సీనియర్ ఎమ్మెల్యేల మంత్రి పదవులు ఇవే అంటూ సోషల్ మీడియా లో మంత్రివర్గ కూర్పుతో వైరల్ అయ్యింది.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మళ్లీ మంత్రి పదవి చేపట్టే అవకాశం ఏపరిస్థితుల్లో లేదని అంటున్నారు. ఇక జేడీఎస్ మీద తిరుగుబాటు చేసి మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ, కుమారస్వామి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన జమీర్ అహమ్మద్ తదితర ఎమ్మెల్యేలలో ఒక్కరికీ కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం లేదు.

హెచ్.డి. కుమారస్వామి సీఎం అయన తరువాత జేడీఎస్ మీద తిరుబాటుచేసి కాంగ్రెస్ లో చేరిన నాయకులకు ముసళ్ళ పండగ మొదలవటం తథ్యం అనేది ఇప్పుడు అందిన  సమాచారం. ఇప్పటికే హెచ్.డి. కుమారస్వామి మీద తిరుగుబాటు చేసి కాంగ్రెస్ లో చేరిన నాయకులు తమకు కాలం మూడిందని హడలిపోతున్నారు. 

మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, హెచ్ డి. కుమారస్వామికి నమ్మకంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు చాముండేశ్వరిలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఓడించిన జీటీ దేవేగౌడకు మంత్రి పదవులు పువ్వుల్లో పెట్తి ఇస్తారని సమాచారం. ఇక గతంలోనూ, ఎన్నికల ముందు జేడీఎస్ నుంచి బయటకు వచ్చి సిద్దరామయ్య కు సన్నిహితంగా ఉన్న నాయకులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం లేదని జేడీఎస్ వర్గాలు ఇప్పటికే అంటున్నాయి.


అయితే కక్ష తీర్చుకునే సహజ గుణమున్న జెడిఎస్ గౌడ కుటుంబం అప్పుడే తన సహజ శైలిలో రాజకీయాలు ప్రారంభించినట్లు ఇప్పటికే అంతర్జాలం నిండా వార్తలు వస్తున్నాయి. అంతే కాదు గౌడ కుటుంబానికి ఆగర్భ శత్రువులైన మరో సామాజిక వర్గం సమయం కోసం మాటువేయసే ఉంది. అంతే కాదు సిద్దరామయ్య లాంటి వ్యూహ చతురుడు గౌడ లీలలు చూస్తూ ఊర్కోలేడని కూడా బంగళూరులో ప్రచారంలో ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: