యడ్డీకి పట్టభిషేకం! సుప్రీం కోర్ట్ ఏం చేయబోతుంది? నేడు అదే గ్రేట్ సస్పెన్స్!

అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అవకాశం కల్పిస్తూ, కర్ణాటక పొలిటికల్ డ్రామాకు గవర్నర్ తెర దించేశారు. యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. రేపు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే బలనిరూపణకు గవర్నర్ 15రోజుల గడువు ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తు న్నామని అన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం ఉందన్నారు.

తమ బలాన్ని నిరూపించుకుని, ఆ తర్వాత తమ కేబినెట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సిద్ధరామయ్య ప్రభుత్వ పనితీరును ప్రజలు తిరస్కరించారని, అయినా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అంటూ తాజా పరిణామాల పై కుమారస్వామి కూడా స్పందించారు. దీనిపై పార్టీ నేతలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే జేడీఎస్ రూటు మార్చింది, ఎమ్మెల్యేలను కాపాడు కునేందుకు వారిని రిసార్టులకు తరలించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను గవర్నర్ ఎలా? ఆహ్వానిస్తారంటూ ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, ఉమ్మడిగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వరన్‌లు. కాంగ్రెస్-జేడీఎస్‌ల కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని పిటిషన్‌లో నేతలుకోరారు. బీజేపీకి 104మంది ఎమ్మెల్యేలే ఉన్నారని, ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే మరో 8మంది కావాలని, తమకు 116మంది సభ్యుల బలం ఉందని ప్రస్తావించారు. అందుకే తమను గవర్నర్ ఆహ్వానించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌‌పై అత్యవసరంగా విచారణ జరపాలని నేతలు కోరారు. మరి జేడీఎస్-కాంగ్రెస్‌ వేసిన ఈ పిటిషన్‌ రాత్రికే విచారణ కు వస్తుందా రాదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: